'కేంద్రాన్ని కోరకపోవడం దారుణం' | Shabbir ali slams TRS sarkar | Sakshi
Sakshi News home page

'కేంద్రాన్ని కోరకపోవడం దారుణం'

Published Sat, May 9 2015 3:44 PM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

Shabbir ali slams TRS sarkar

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని సంక్షోభం నుంచి గట్టెంకించే ఎటువంటి ప్రయత్నాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. అసలు కేసీఆర్ సర్కార్ రైతులను పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ.. ఢిల్లీకి వెళ్లిన  కేసీఆర్ కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర రైతులను ఆదుకోవాలని కోరకపోవడం దారుణమన్నారు.

 

సచివాలయం కంటోన్మెంట్ భూమి కావాలని మాత్రమే కేసీఆర్ కోరడాన్ని షబ్బీర్ అలీ తప్పుబట్టారు. కరువు మండలాలను ప్రకటించకుండా ఇంకా జాప్యం చేయడం వల్ల వ్యవసాయం సంక్షోభం తీవ్రమవుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement