గిరిజనులకు రిజర్వేషన్లు ఏమయ్యాయి?
మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు.ఏప్రిల్ 23న నిర్వహించనున్న గిరిజన శంఖారావానికి సంబంధించిన పోస్టర్‌ను మాజీ మంత్రి రవీంద్రనాయక్, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం ఆవిష్కరించారు.
ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని షబ్బీర్ విమర్శించారు. లంబాడీ తండాల ను గ్రామ పంచాయతీలు చేస్తామన్న హామీ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. పచ్చి అబద్ధాలతో సీఎం మోసం చేస్తున్నా రని రవీంద్రనాయక్ విమర్శించారు. కనీసం గిరిజన మండలి కూడా ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు.