సాక్షి, న్యూఢిల్లీ : విమానాల తరహాలో రైళ్లలోనూ బ్లాక్ బాక్స్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. విమానాల్లో మాదిరిగా రైళ్లలో లోకో కాబ్ ఆడియో వీడియా రికార్డింగ్ సిస్టమ్, క్రూ వాయిస్, వీడియో రికార్డింగ్ సిస్టమ్‌లను నెలకొల్పుతామని పార్లమెంట్‌లో రైల్వే సహాయ మంత్రి శ్రీ రాజెన్ గోహెన్ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
ఊహించని ఘటనలు జరిగిన సందర్భాల్లో ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, నిర్వహణ అంశాలు, మానవ తప్పిదాలను గుర్తించేందుకు దర్యాప్తు అధికారులకు ఈ వ్యవస్థ కీలక సమాచారం చేరవేస్తుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సిస్టమ్‌ను ఇప్పటికే 26 రైళ్లలో అమర్చినట్టు తెలిపింది. ఈ వ్యవస్థను పలు రైళ్లలో అమర్చేందుకు అవసరమైన పరికరాల కొనుగోలుకు 2018-19 బడ్జెట్‌లో రూ 100 కోట్లు కేటాయించినట్టు ప్రకటన తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment