న్యూఢిల్లీ: ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు వారికి ఇవ్వాలని రైల్వే శాఖ యోచిస్తున్నట్లు రైల్వే బోర్డుకు చెందిన సీనియర్ అధికారి గిరీశ్ పిళ్లై చెప్పారు. ఈ విషయంపై సీనియర్ అధికారులు చర్చిస్తున్నామన్నారు.
‘ప్రపంచవ్యాప్తంగా రైల్వే నిర్వహణలో మార్పులొచ్చాయి. భారత్‌లోనూ ఈ మార్పులకు సమయం ఆసన్నమైంది. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంపై చర్చిస్తున్నాం’ అని అన్నారు. చార్జీల నిర్ణయం, టెర్మినళ్ల నిర్మాణం వంటి వాటి వరకు అనుమతించవచ్చా లేదా అన్న విషయంపై సీనియర్ అధికారులు చర్చిస్తున్నట్లు తెలిపారు. ప్యాసింజర్, సరుకు రవాణా నిర్వహణను విడివిడిగా చూడాల్సిన అవసరమొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment