కోవింద్ కమిటీ లోక్‌సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలి ఎన్నికలపై నివేదిక సమరి్పంచింది. ’ఒక దేశం, ఒకే ఎన్నిక’ను రెండు దశల్లో అమలు చేయాలని సూచించింది. ఏం చెప్పిందంటే...
→ జమిలి ఎన్నికలను అమల్లోకి తెచ్చేందుకు చట్టపరంగా చెల్లుబాటయ్యే వ్యవస్థను కేంద్రం అభివృద్ధి చేయాలి.
→ తొలి దశలో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి.
→ అనంతరం 100 రోజుల్లోపు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరపేలా వ్యవస్థలను రూపొందించాలి.
→ సార్వత్రిక ఎన్నికలు జరిగి, కొత్తగా కొలువుదీరే లోక్‌సభ తొలిసారి సమావేశమయ్యే తేదీని ‘అపాయింటెడ్ డే’గా రాష్ట్రపతి నోటిఫై చేయాలి. దాంతో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు నాంది పడుతుంది.
→ అపాయింటెడ్ డే తర్వాత ఏర్పడే అన్ని అసెంబ్లీల గడువూ లోక్‌సభతో పాటే ముగుస్తుంది. తదనంతరం లోక్‌సభ, అన్నీ అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి.
→ లోక్‌సభలో ఏ పారీ్టకీ మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడి, లేదా అవిశ్వాస తీర్మానం వంటివి నెగ్గి సభ రద్దయినా మళ్లీ ఎన్నికలు జరపాలి.
→ అలాంటి సందర్భంలో కొత్త సభ గడువు.. రద్దయిన సభలో మిగిలిన కాలావధి వరకు మాత్రమే ఉంటుంది.
→ అసెంబ్లీలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే హంగ్ తదితర కారణాలతో ఎన్నికలు జరిగి మధ్యలో కొత్తగా ఏర్పడే అసెంబ్లీలు ఐదేళ్లు కొనసాగకుండా లోక్‌సభతో పాటే రద్దవుతాయి.
→ అన్ని ఎన్నికలకూ ఉమ్మడిగా ఒకే ఎలక్టోరల్ రోల్, ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్) ఉపయోగించాలి.
ఆమోదం ఈజీ కాదు
జమిలి ఎన్నికలకు పార్లమెంటు ఆమోదముద్ర పొందడం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుకు అంతా ఈజీ కాబోదు. నవంబర్ గేమ్ అధికార కూటమికి అంత అనుకూలంగా లేదు. జమిలికి సంబంధించి కోవింద్ కమిటీ పలు రాజ్యాంగ సవరణలు సూచించింది. వాటికి ఆమోదం లభించాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. అందుకు 543 మంది ఎంపీలున్న లోక్‌సభలో 362 మంది; 245 మంది ఎంపీలుండే రాజ్యసభలో 164 మంది మద్దతు అవసరం. కానీ ఎన్డీయే కూటమికి లోక్‌సభలో 293 మంది, రాజ్యసభలో 113 మంది ఎంపీలే అన్నారు. అయితే కోవింద్ కమిటీ ముందు జమిలిని సమరి్థంచిన పారీ్టలకున్న లోక్‌సభ సభ్యుల సంఖ్య 271 మాత్రమే. దాన్ని వ్యతిరేకించిన 15 పారీ్టలకు 205 మంది లోక్‌సభ సభ్యులున్నారు. విపక్ష ఇండియా కూటమికి రాజ్యసభలో 85 మంది సభ్యుల బలముంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment