Committee report
-
జమిలి ఇలా రెండు దశలుగా అమలు
కోవింద్ కమిటీ లోక్‌సభ ఎన్నికలకు ముందు గత మార్చిలో జమిలి ఎన్నికలపై నివేదిక సమరి్పంచింది. ’ఒక దేశం, ఒకే ఎన్నిక’ను రెండు దశల్లో అమలు చేయాలని సూచించింది. ఏం చెప్పిందంటే... → జమిలి ఎన్నికలను అమల్లోకి తెచ్చేందుకు చట్టపరంగా చెల్లుబాటయ్యే వ్యవస్థను కేంద్రం అభివృద్ధి చేయాలి. → తొలి దశలో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలి. → అనంతరం 100 రోజుల్లోపు రెండో దశలో పంచాయతీలు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థలన్నింటికీ ఎన్నికలు జరపేలా వ్యవస్థలను రూపొందించాలి. → సార్వత్రిక ఎన్నికలు జరిగి, కొత్తగా కొలువుదీరే లోక్‌సభ తొలిసారి సమావేశమయ్యే తేదీని ‘అపాయింటెడ్ డే’గా రాష్ట్రపతి నోటిఫై చేయాలి. దాంతో లోక్‌సభకు, అన్ని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు నాంది పడుతుంది. → అపాయింటెడ్ డే తర్వాత ఏర్పడే అన్ని అసెంబ్లీల గడువూ లోక్‌సభతో పాటే ముగుస్తుంది. తదనంతరం లోక్‌సభ, అన్నీ అసెంబ్లీల ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. → లోక్‌సభలో ఏ పారీ్టకీ మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడి, లేదా అవిశ్వాస తీర్మానం వంటివి నెగ్గి సభ రద్దయినా మళ్లీ ఎన్నికలు జరపాలి. → అలాంటి సందర్భంలో కొత్త సభ గడువు.. రద్దయిన సభలో మిగిలిన కాలావధి వరకు మాత్రమే ఉంటుంది. → అసెంబ్లీలకు కూడా ఇదే వర్తిస్తుంది. అంటే హంగ్ తదితర కారణాలతో ఎన్నికలు జరిగి మధ్యలో కొత్తగా ఏర్పడే అసెంబ్లీలు ఐదేళ్లు కొనసాగకుండా లోక్‌సభతో పాటే రద్దవుతాయి. → అన్ని ఎన్నికలకూ ఉమ్మడిగా ఒకే ఎలక్టోరల్ రోల్, ఓటర్ల ఫోటో గుర్తింపు కార్డు (ఎపిక్) ఉపయోగించాలి. ఆమోదం ఈజీ కాదు జమిలి ఎన్నికలకు పార్లమెంటు ఆమోదముద్ర పొందడం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుకు అంతా ఈజీ కాబోదు. నవంబర్ గేమ్ అధికార కూటమికి అంత అనుకూలంగా లేదు. జమిలికి సంబంధించి కోవింద్ కమిటీ పలు రాజ్యాంగ సవరణలు సూచించింది. వాటికి ఆమోదం లభించాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మంది ఎంపీల మద్దతు తప్పనిసరి. అందుకు 543 మంది ఎంపీలున్న లోక్‌సభలో 362 మంది; 245 మంది ఎంపీలుండే రాజ్యసభలో 164 మంది మద్దతు అవసరం. కానీ ఎన్డీయే కూటమికి లోక్‌సభలో 293 మంది, రాజ్యసభలో 113 మంది ఎంపీలే అన్నారు. అయితే కోవింద్ కమిటీ ముందు జమిలిని సమరి్థంచిన పారీ్టలకున్న లోక్‌సభ సభ్యుల సంఖ్య 271 మాత్రమే. దాన్ని వ్యతిరేకించిన 15 పారీ్టలకు 205 మంది లోక్‌సభ సభ్యులున్నారు. విపక్ష ఇండియా కూటమికి రాజ్యసభలో 85 మంది సభ్యుల బలముంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
5 సెకన్లలో 2 పేలుళ్లు
సాక్షి, విశాఖపట్నం : అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీలో నిర్లక్ష్యం కారణంగానే పెను ప్రమాదం సంభవించిందని, ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ వెల్లడించింది. తొలి పేలుడు జరిగిన 5 సెకన్లలోనే మరో పేలుడు సంభవించిందని తెలిపింది. భారీ పేలుళ్ల ధాటికి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడం, గ్రౌండ్ ఫ్లోర్ గోడలు, మొదటి అంతస్తు శ్లాబు కొంత భాగం కూలడం, ఈ సంస్థ భవనాలకు అత్యవసర మార్గాలు, అత్యవసర మెట్లు లేకపోవడంతో కార్మికులు తప్పించుకోలేక ప్రాణ నష్టం అధికంగా ఉందని వెల్లడించింది.ఎసైన్షియా ఫార్మా కంపెనీలో ఈ నెల 21న జరిగిన ఘోర ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణంపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల శాఖ, బాయిలింగ్, ఫైర్ సేఫ్టీ, ఏపీపీసీబీ అధికారులు, నిపుణులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇంత ఘోర ప్రమాదం జరగడానికి ముందు ఏం జరిగింది, కారణాలేమిటో క్షుణ్ణంగా విచారణ జరిపి ప్రాథమిక నివేదిక రూపొందించింది. వారం రోజుల్లో మరో నివేదిక ఇవ్వనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.నివేదికలోని ప్రధానాంశాలు..⇒ కొత్త డ్రగ్స్ తయారీకి ప్రయోగాలు ఇక్కడే జరుగుతుంటాయి. బ్యాచ్‌ల వారీగా పరిశోధనలు చేస్తుంటారు. మూడు నెలల విరామం తర్వాత ఫస్ట్ బ్యాచ్ పరిశోధన ప్రారంభించింది. ⇒ఆ రోజు రియాక్టర్లో 500 లీటర్ల మిౖథెల్ టెర్ట్ బ్యూటైల్ ఈథర్ (ఎంటీబీఈ) ద్రావకం తయారీకి వ్యాక్యూమ్ డిస్టిలేషన్ ప్రారంభించారు. ⇒ ఇక్కడ తయారయ్యే వ్యాక్యూమ్ డిస్టిలేషన్ని నైట్రోజన్ ప్రెజర్ ద్వారా రెండో ఫ్లోర్లో ఉన్న 5 వేల లీటర్ల స్టోరేజ్ ట్యాంక్‌కు పంపింగ్ చేస్తున్నారు. ⇒మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రెండో అంతస్తులో ఎంటీబీఈ లీకై ఘాటైన వాసన వస్తుండటాన్ని ప్రొడక్షన్ టీమ్ గుర్తించింది. ఇది క్రమంగా మొదటి అంతస్తుకూ వ్యాపించింది. ⇒ మొదటి అంతస్తులోని కార్మికులు ఆ వాసనను గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి రెండో అంతస్తుకు వెళ్తున్న ఎంటీబీఈ పైప్‌లైన్‌ను పరిశీలించారు. ట్రాన్స్ఫర్ లైన్లో ఎంటీబీఈ వ్యాక్యూమ్ లీకవుతున్నట్లు గుర్తించారు. ⇒ఈ కెమికల్ పైపుల నుంచి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న విద్యుత్ కేబుల్స్ వెళ్తున్న కటౌట్స్ పైన పడి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ (ఎంసీసీ) ప్యానెల్‌పై పడుతున్నట్లు గుర్తించారు. ⇒ వెంటనే ఇంజినీరింగ్ అండ్ ప్రొడక్షన్ సిబ్బందికి కార్మికులు సమాచారమిచ్చారు. లంచ్ టైమ్ కావడంతో ఆ సమయంలో ఆ సిబ్బంది అందరూ భోజనం చేస్తున్నారు. దీంతో లీకేజీని అరికట్టేందుకు ఎవ్వరూ రాలేదు. ⇒ బిల్డింగ్‌లో ప్రతి ఫ్లోర్‌ను అనుసంధానం చేసేలా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ (ఏహెచ్‌యూ) ఉన్నాయి. ఏహెచ్‌యూ ప్రధాన యూనిట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఏవైనా వాయువులు లీకైతే ఏహెచ్‌యూ ద్వారా బయటకు వెళ్లిపోతుంటాయి. కానీ.. ఆ రోజు లీకైన ఎంటీబీఈ రసాయనం ఆవిరి ఏహెచ్‌యూ ద్వారా ప్రాసెస్ డెవలప్మెంట్ (పీడీ) ల్యాబ్, కార్యాలయం గదులు, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ ఎస్యూరెన్స్ గదులు, యుటిలిటీ అండ్ మెటీరియల్ నిల్వ ప్రాంతాలకు వ్యాపించింది.⇒ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భోజనం అనంతరం వచి్చన బృందాలు లీకేజీని అరికట్టే ప్రక్రియ ప్రారంభించాయి. ⇒ కానీ.. అప్పటికే ఏహెచ్యూల ద్వారా కమ్ముకున్న ఆవిరి లోవర్ ఎక్స్‌ప్లోజివ్ లిమిట్ (ఎల్‌ఈఎల్) స్థాయికి చేరుకుంది. దీంతో హఠాత్తుగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఎంసీసీ ప్యానెల్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి గ్రౌండ్ ఫ్లోర్ ప్లెయిన్ సిమెంట్, కాంక్రీట్ (పీసీసీ) గోడలు కూలిపోయాయి. మొదటి అంతస్తు శ్లాబులో కొంత భాగం కుప్పకూలింది. ⇒ వెంటనే కార్మికులు, సిబ్బంది బయటకు వెళ్లిపోయేందుకు ప్రయతి్నంచారు. ⇒ 5 సెకెన్లలోనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఏహెచ్‌యూ మెయిన్ ప్యానల్లో రెండో పేలుడు సంభవించింది. దీంతో.. ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఉన్న మొదటి, రెండో అంతస్తుల్లోని అన్ని రూములూ తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ⇒ ఈ పేలుడు తీవ్రత పీడీ ల్యాబ్, యుటిలిటీ, ప్రొడక్షన్ ఏరియాలోనూ తీవ్ర ప్రభావం చూపింది. ⇒ వెంటవెంటనే పేలుళ్లు సంభవించడంతో అత్యవసర మార్గాలు లేక కార్మికులు తప్పించుకోవడానికి అవకాశం లేకుండాపోయింది. ⇒ ఎంటీబీఈ 28 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద లోవర్ ఎక్స్‌ప్లోజివ్ లిమిట్ (ఎల్‌ఈఎల్) 1.6 శాతం, అప్పర్ ఎక్స్‌ప్లోజివ్ లిమిట్ (యూఈఎల్) 15.1 శాతం ఉంది. ఈ ఎంటీబీఈ ఆవిరి అన్ని ప్రాంతాలకూ తీవ్రస్థాయిలో విస్తరించడమే ప్రమాదానికి ప్రధాన కారణం.⇒ దాదాపు బిల్డింగ్‌లోని అన్ని ప్రాసెసింగ్ ప్రాంతాలకూ ఏహెచ్యూల ద్వారా ఎంటీబీటీఈ వ్యాక్యూమ్ చేరుకుంది. దీనివల్ల పేలుడు తీవ్రత ఎక్కువైంది. ⇒ బిల్డింగ్ నిర్మాణంలో లోపాలు కూడా ప్రమాద తీవ్రతకు ప్రధాన కారణం. పీడీ ల్యాబ్, ఆఫీస్ బిల్డింగ్, మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ పక్కపక్కనే ఉండకూడదు. కానీ.. అన్నీ ఒకేచోట ఏర్పాటు చేశారు. ⇒ అంతేకాకుండా ఈ భవనాలన్నింటినీ ఏహెచ్యూతో అనుసంధానం చేశారు. ప్రాసెసింగ్ ప్రక్రియ చేయని రూమ్లకూ వీటిని అనుసంధానం చేయడం కూడా ప్రధాన లోపమే. ⇒ ముఖ్యంగా.. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లకు ఒక్కటే మెట్ల మార్గం ఉంది. ఎలాంటి అత్యవసర మార్గాలు, అత్యవసర మెట్లు లేవు. ఉన్న ఒక్క మార్గం మొదటి పేలుడు ధాటికే కూలిపోయింది. ⇒ భవనం చుట్టూ ఎక్స్టర్నల్ కారిడార్లు లేవు. అనుసంధానించే మెట్లు కూడా లేవు. దీనివల్ల కొందరు దూకేందుకు ప్రయతి్నంచినా.. భవన శిథిలాల కింద పడి నలిగిపోయారు. ⇒ ప్రతి ఫార్మా కంపెనీలోనూ ఉత్పత్తి ప్రారంభించే ముందు ప్రతి విభాగాన్ని క్షణ్ణంగా పరిశీలిస్తారు. దీన్నే ప్రీ స్టార్టప్ చెక్స్ (పీఎస్ఎస్ఆర్) అంటారు. ఈ పరిశ్రమలో అది కూడా చెయ్యడం లేదు. ⇒ రసాయన మిశ్రమాలు, రసాయనిక ఆవిరి వెళ్లే లైన్లు సరిగ్గా విద్యుత్ కేబుల్స్ పైనే వేశారు. దీనివల్ల ఏ చిన్న సాల్వెంట్ లీకేజీ జరిగినా నేరుగా విద్యుత్ కేబుల్ కటౌట్స్పై పడటంతో పాటు ఎంసీసీ ప్యానెల్స్ దెబ్బతినేలా వ్యవస్థ ఉంది. ⇒ ఎంటీబీఈ లీకేజీని గమనించిన తర్వాత తక్షణమే స్పందించేందుకు ఎవ్వరూ లేకపోవడం వల్ల.. ఈ సాల్వెంట్ ఆవిరి వాసన పీల్చి ఉద్యోగులు, కార్మికులు ఇబ్బంది పడ్డారు. అయినా.. ఈ ప్రమాదం జరుగుతుందని ఎవ్వరూ ఊహించకపోవడంతో బయటకు వెళ్లకుండా పనిలోనే నిమగ్నమయ్యారు. ఫలితంగా ప్రాణనష్టం ఎక్కువగా సంభవించిందని ఉన్నతస్థాయి విచారణ కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. -
Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదు సర్వే నివేదిక లీక్!!
లక్నో: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చేస్తున్న జ్ఞానవాపి మసీదు సర్వే నివేదిక.. వారణాసి కోర్టుకి చేరింది. ఒకవైపు ఈ వ్యవహారంలో తమ దగ్గర వాదనలు పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించొద్దంటూ సుప్రీం కోర్టు గురువారం వారణాసి కోర్టును ఆదేశించింది. అయినప్పటికీ ముందుగా విధించిన గడువు కావడంతో.. సర్వే చేపట్టిన అడ్వొకేట్ కమిటీ ఇవాళే నివేదికను వారణాసి కోర్టులో సమర్పించింది. ఇదిలా ఉంటే.. గురువారం అడ్వొకేట్ కమిషన్ జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో చేపట్టిన సర్వే నివేదికను వారణాసి కోర్టులో సమర్పించింది. అయితే సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించిన నివేదిక కాపీ సమాచారం.. బయటకు పొక్కిందనే ప్రచారం కలకలం రేపుతోంది. కోర్టుకు సమర్పించిన గంటల వ్యవధిలోనే పిటిషనర్ల(ఐదుగురు హిందూ మహిళలు) తరపు న్యాయవాదుల చేతుల్లోకి కాపీ వెళ్లిందని, అక్కడి నుంచి లీకుల పర్వం మొదలైందని ప్రచారం నడుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా చానెల్స్‌లో కథనాలు వస్తుండడం గమనార్హం. బహిర్గతం అయిన ఆ నివేదికలో.. హిందూ విగ్రహాలు, చిహ్నాలు ఉన్నాయని... పిటిషనర్లు వాళ్ల వాదనలను సమర్థిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. సర్వే పూర్తయ్యే తరుణంలోనే.. శివలింగం బయటపడిందంటూ కొన్ని ఫొటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై సీరియస్ అయిన కోర్టు.. అడ్వొకేట్ కమిషనర్ అయిన అజయ్ మిశ్రాను తప్పించింది. బయటకు పొక్కిన నివేదిక వివరాలు.. మసీదు పిల్లర్ల బేస్మెంట్లో.. కలశం, పువ్వుల నగిషీలు, ప్రాచీన హిందీ భాషలో చెక్కిన అక్షరాలు బేస్మెంట్ గోడలో త్రిశూల ఆకారం మసీదు పశ్చిమం వైపు గోడ మీద కమాను, రెండు పెద్ద పిల్లర్లు ఆలయానికి సంబంధించిన గుర్తులేనని పిటిషనర్ల వాదన. మసీదు మధ్య డోమ్ కింద.. శంఖాకార నిర్మాణం మూడో డోమ్ కింద.. తామర పువ్వులను పోలిన నగిషీలు మసీదు వాజుఖానాలో బయటపడ్డ రెండున్నర అడుగుల ఎత్తున్న ఆకారం(శివలింగం) అని పిటిషనర్లు.. కాదు ఫౌంటెన్ నిర్మాణమని మసీదు నిర్వాహకుల వాదన. మసీదు ప్రాంగణాన్ని ఆనుకుని ఉన్న గోడ కోర్టుకు మాత్రమే పరిమితం కావాల్సిన నివేదిక.. సున్నితమైన అంశానికి సంబంధించిన చాలా గోప్యమైన నివేదిక బయటకు పొక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లీక్ అయిన ఈ నివేదికపై మసీదు కమిటీ కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. ఒకవేళ ప్రచారంలో ఉన్న నివేదికే నిజమైతే మాత్రం.. కోర్టు ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ► వారణాసి కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో మూడు రోజులపాటు.. భారీ భద్రత నడుమ అడ్వొకేట్ కమిటీ సమక్షంలో వీడియోగ్రఫీ సర్వే జరిగింది. 14 నుంచి 16వ తేదీల మధ్య ఈ సర్వే పూర్తైంది. ఈ సర్వే సమయంలోనే అడ్వొకేట్ కమిషనర్ అజయ్ మిశ్రా లీకుల ద్వారా మసీదు వజుఖానాలో ‘శివలింగం’ బయటపడిందనే కథనాలు బయటకు వచ్చాయి. దీంతో శివలింగాన్ని సంరక్షిస్తూనే.. నమాజ్‌లకు ఆటంకాలకు కలిగించవద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా ఆ ప్రాంతంలో భద్రతను ఏర్పాటు చేశారు. ► మరోవైపు సర్వే పూర్తి నివేదికను అడ్వొకేట్ కమిషనర్ విశాల్ సింగ్(లీక్ నేపథ్యంలో అజయ్ మిశ్రాను తొలగించి..) ఆధ్వర్యంలో వారణాసికి కోర్టుకు సమర్పించారు. మూడు సీల్డ్ బాక్సుల్లో, వందలాది ఫొటోలు, వీడియోలతో కూడిన ఒక చిప్‌ను సమర్పించారు. ఈ లోపే లీక్ కథనాలు కలకలం సృష్టిస్తున్నాయి. సుప్రీం కోర్టులో దాఖలైన వీడియోగ్రఫీ సర్వే అభ్యంతర పిటిషన్‌పై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. అటుపై పరిస్థితిని బట్టి.. సోమవారం ఈ కేసులో తదుపరి వాదనలు వారణాసి కోర్టులో జరగనున్నాయి. చదవండి: మసీదులు అంతకుముందు ఆలయాలే! తాఖీర్ రజా వ్యాఖ్యల దుమారం -
మా సిఫార్సులు రైతు అనుకూలం!
న్యూఢిల్లీ: రైతు చట్టాలపై అధ్యయనానికి సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదిక వందశాతం రైతులకు అనుకూలమని కమిటీలో కీలక సభ్యుడొకరు వెల్లడించారు. సుప్రీంకోర్టు త్వరలో ఈ విషయాన్ని ఎలాంటి జాప్యం లేకుండా విచారించాలని కోరారు. కమిటీ నివేదిక బహిర్గతం చేయడం వల్ల తలెత్తే అవకాశమున్న చట్టపరమైన సమస్యలను సుప్రీం, కేంద్రం పరిగణించి కొంత సమయం తీసుకోవచ్చని, అయితే పూర్తిగా నివేదికను బుట్టదాఖలా చేయడం కుదరదని, అలా చేయకూడదని కమిటీ సభ్యుడు అనీల్ జే ఘనావత్ అభిప్రాయపడ్డారు. అందరూ ఆందోళనచెందుతున్నట్లు కొత్త చట్టాలతో ఎంఎస్పీ(కనీస మద్దతు ధర) రద్దు కాదని, కొత్త చట్టంలో అసలు ఎంఎస్పీ అంశమే లేదని చెప్పారు. నివేదికను ప్రజల్లో ఉంచాలని సెపె్టంబర్1న ఆయన సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అలాగని ప్రభుత్వం తెచి్చన మూడు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న వాదనకు కమిటీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు. అయితే చట్టాల్లో పలు లోపాలున్నట్లు తమ కమిటీ పరిశీలనలో తేలిందని వివరించారు. వీటిని పరిష్కరించాల్సిఉందని సూచించారు. అందువల్ల సుప్రీంకోర్టు వెంటనే నివేదికను బహిర్గతం చేయాలని కోరినట్లు తెలిపారు. మూడు వ్యవసాయ చట్టాల అధ్యయనానికి 2021 జనవరిలో ఒక కమిటీని రూపొందించింది. ఇందులో షెట్కారీ సంఘటన నాయకుడైన ఘనావత్ ఒక సభ్యుడు. ఈయనతో పాటు సీఏసీపీ మాజీ చైర్మన్ అశోక్ గులాటి, ఐఎఫ్‌పీఆర్‌ఐకి చెందిన ప్రమోద్ కుమార్ కమిటీలో ఉన్నారు. -
మహారాష్ట్రలో సెకండ్ వేవ్?
న్యూఢిల్లీ: కోవిడ్ సెకండ్ వేవ్ ముంగిట్లో మహారాష్ట్ర ఉందని కేంద్ర బృందం తన నివేదికలో హెచ్చరించింది. కరోనా కట్టడికి అత్యంత ప్రధానమైన ట్రాక్, టెస్ట్, ట్రీట్ విధానాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం సరిగా పాటించడం లేదని నివేదికలో పేర్కొంది. కరోనా రోగుల్ని కలుసుకున్న వారెక్కడున్నారో వెతికి పట్టుకొని క్వారంటైన్ చేయడంలో శ్రద్ధ చూపించడం లేదని తెలిపింది. ఇక గ్రామాలు, నగరాలు అన్న తేడా లేకుండా ప్రజలందరూ అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కోవిడ్ నిబంధనలు పాటించడం లేదని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మహారాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం ఒక లేఖ రాశారు. రాత్రిపూట కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లు ఇక లాభం లేదని, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కరోనా విజృంభిస్తే ఆరోగ్య రంగంలో సదుపాయాల్ని పెంచాలని మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామ్ కుంతేకి రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు. మార్చి 7–11 తేదీల మధ్య కేంద్ర బృందం మహారాష్ట్రలో పర్యటించింది. గత ఏడాది ఆగస్టు–సెప్టెంబర్ నాటి కోవిడ్ ఆంక్షల్ని పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా కేసులు నమోదవుతున్న 10 జిల్లాల్లో ఎనిమిది మహారాష్ట్రలో ఉండడం కరోనా తీవ్రతకు అద్దంపడుతోందని, సామాజిక వ్యాప్తి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో సోమవారం ఒక్క రోజే 15,051 కేసులు నమోదయ్యాయి. గత నెల రోజుల్లోనే యాక్టివ్ కేసుల సంఖ్య 172% పెరిగిపోయాయి. మరోవైపు మహారాష్ట్రకి 2.20 కోట్ల టీకా డోసులు కావాలని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గుజరాత్, మధ్యప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూ మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో కూడా కరోనా కేసులు అధికమవుతూ ఉండడంతో నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తున్నారు. అహ్మదాబాద్, వడోదరా, సూరత్, రాజ్కోటలలో రాత్రిపూట కర్ఫ్యూని మార్చి 31 వరకు పొడిగించారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలియర్, ఉజ్జయిని, రాత్లాం, బర్హాన్‌పూర్, చింద్వారాలలో మార్చి 17 నుంచి రాత్రి పూట కర్ఫ్యూని అమలు చేయనున్నారు. మధ్యప్రదేశ్‌లో ఇంచుమించుగా రోజుకి వెయ్యి కేసుల వరకు నమోదవుతున్నాయి. దేశంలో కోవిడ్ మహమ్మారితో తలెత్తిన పరిస్థితులు, వ్యాక్సినేషన్ తీరుతెన్నులపై ప్రధాని మోదీ నేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా చర్చించనున్నారు. 24,492 కొత్త కేసులు దేశంలో గత 24 గంటల్లో 24,492 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,09,831కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం వెల్లడించింది. అదే సమయంలో కోవిడ్ కారణంగా తాజాగా మరో 131 మంది మరణించడంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 1,58,856కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,10,27,543కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 96.65 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,23,432గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 1.96 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.39గా ఉంది. ఇప్పటివరకూ వరకూ 22,82,80,763 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. సోమవారం 8,73,350 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణాల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోందని చెప్పింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. ఇప్పటివరకూ 2.99 కోట్ల మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. -
క్రేన్ నిర్వహణలో నిర్లక్ష్యం: వినయ్ చంద్
సాక్షి, విశాఖపట్నం: క్రేన్ నిర్మాణంలో లోపం కారణంగానే హిందూస్ధాన్ షిప్ యార్డులో క్రేన్ ప్రమాదానికి గురైందని విశాఖపట్నం కలెక్టర్ వినయ్ చంద్ అన్నారు. ఈ నెల 1న క్రేన్ ప్రమాదంలో చోటు చేసుకున్న ప్రమాదంలో పది మంది మృతి చెందడంతో.. ఐదుగురు ఆంధ్రా యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు, విశాఖ ఆర్డిఓ, ఆర్ అండ్ బి ఎస్ఈలతో కమిటీ నియమించామని తెలిపారు. ఆ కమిటీ బుధవారం షిప్ యార్డులో జరిగిన ప్రమాదంపై నివేదికను అందజేసిందని తెలిపారు. కమిటీ వారం రోజులపాటు క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించి నివేదిక అందించిందని పేర్కొన్నారు. క్రేన్ నిర్వహణలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని, 70 టన్నుల లోడ్‌కి సంబంధించి క్రేన్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని నిపుణుల కమిటీ నివేదికలో స్పష్టం చేసిందన్నారు. క్రేన్‌కి సంబంధించి కార్బన్ బ్రషెష్ పడిపోవడం, ఇన్సులేటర్స్ పాడై మూడుసార్లు మార్చారని తెలిపారు. గతంలో ట్రయల్ రన్ చేస్తున్న సమయంలోనే గేర్ బాక్స్‌లో ఆయిల్ లీకేజ్ జరిగిందని వివరించారు. (విశాఖ: షిప్ యార్డ్ ప్రమాదంపై నివేదిక) గేర్ బాక్స్ ఫెయిల్యూర్ వల్ల భారీ శబ్దంతో క్రేన్ కుప్పకూలిందన్నారు. ప్రమాదం కేవలం పది సెకన్లలోనే జరిగిపోయిందని, క్రేన్ స్ట్రక్చరల్ డిజైనింగ్, డ్రాయింగ్స్ థర్డ్‌పార్టీతో పరిశీలించలేదని స్పష్టం చేశారు. క్రేన్ నిర్మాణంలోనే లోపాలున్నాయని, సామర్థ్యానికి తగ్గట్లుగా క్రేన్ నిర్మాణం జరగలేదని తెలిపారు. నిపుణులతోనే తప్పనిసరిగా లోడ్ టెస్టింగ్ పరిశీలన జరపాలన్నారు. థర్డ్‌పార్టీ ఆధ్వర్యంలోనే ట్రయల్ రన్ నిర్వహించాలని నిపుణులు సూచించారని తెలిపారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినయ్ చంద్ పేర్కొన్నారు. -
ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధాని ప్రాంత రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. విశాఖలోని ప్రభుత్వ అతిథిగృహంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధానిపై స్పష్టత కోసం కమిటీ వేశామని, ఆ కమిటీ నివేదిక ఇచా్చక రాజధానిపై పూర్తి స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం వరకు ఉన్న పరిస్థితిని మాత్రమే శాసన మండలిలో చెప్పటం జరిగిందన్నారు. రాజధాని విషయంలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత స్పష్టత ఇస్తామని తెలిపారు. అమరావతిలో భవనాల నిర్మాణాలు ఏ దశలో ఉన్నా వాటిని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారని ఆయన చెప్పారు. 55 శాతం నిర్మాణం పూర్తయిన వాటిని వీలైనంతా వేగంగా పూర్తి చేస్తామన్నారు. టీడీపీ వాళ్లు అసెంబ్లీలో దుర్బాషలాడుతూ సభను సజావుగా జరగనివ్వడం లేదని మంత్రి తప్పుపట్టారు. విశాఖ మెట్రోను రెండు దశలుగా చేపట్టాలని నిర్ణయించామని, భోగాపురం ఎయిర్‌పోర్టు విషయమై మరోసారి టెండరుకు వెళ్లాలనే విషయంపై ఆలోచిస్తున్నామని మంత్రి చెప్పారు. -
మన కమిటీ.. మన నివేదిక!
సాక్షి, అమరావతి: వడ్డించే వాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఇబ్బంది లేదు అనే సామెత అక్షరాలా సరిపోతుంది దుర్గగుడి వ్యవహారంలో. వివాదం ఏదైనా కమిటీ వేసేది మనమే.. వచ్చే నివేదిక మనకు అనుకూలంగానే అన్న చందంగా తయారయ్యింది ప్రస్తుత పరిస్థితి. నిజనిర్థరణ కమిటీని వేసి విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు చేయాల్సిన పనులన్నీ చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ఇందుకోసం ముందుగానే తాంత్రిక పూజలు జరగలేదని నిజనిర్థారణ కమిటీతో చెప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, కీలక నిందితుడు పార్థసారథితో పాటు అర్చకులు, దేవస్థానం ఇద్దరు ప్రధాన అర్చకులు, స్థానాచార్య, ఇతర అర్చకులను పిలిచి విచారణ చేశారు. ఈ విచారణలో కొంత మంది తాంత్రిక పూజలు జరిగాయని నిర్థారించి చెప్పగా, మరికొంత మంది అర్చకులు కూడా తాంత్రిక పూజలు జరిగిన మాట వాస్తవేమని అభిప్రాయ పడ్డారు. అయితే ఆలయ అధికారులు, అర్చకులు విచారణలో చెప్పిన మాటలను కమిటీ పరిగణలోకి తీసుకోకుండా నివేదిక సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుల ఒత్తిడికి లోబడి నివేదిక రూపుదిద్దకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు, నివేదికను ఎలా రూపొందించాలి అనే విషయంపై నిజనిర్థారణ కమిటీతో పలుపార్లు చర్చలు జరిపారు. ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా తాంత్రిక పూజలు జరగలేదనే విధంగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. దేవస్థానంలోని విషయాలు బయటకు పొక్కడం వల్ల ఎవరూ నోరు ఎత్తవద్దంటూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. నిజ నిర్ధారణ కమిటీ తీరుపై హిందూ ధర్మకర్తలు, పీఠాధిపతులు, స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాలను వెల్లడించాల్సిన కమిటీ ప్రభుత్వం ఒత్తుడులకు లోబడి పనిచేసిందని విమర్శించారు. దుర్గాదేవి, మహిషాసురమర్దిని అవతారాలు ఒక్కటేనని మీరు ఎలా నిర్ణయిస్తారంటూ కమిటీ సభ్యులపై స్వామీజీలు మండిపడ్డారు. -
కమిటీ నివేదికకు గడువు నిర్దేశించలేం
తేల్చి చెప్పిన ఉమ్మడి హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ఓ నిర్దిష్ట వ్యవహారానికి సంబం ధించి కమిటీ ఏర్పాటు చేసినప్పుడు అది ఫలానా గడువులోపు నివేదిక ఇవ్వాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయలేవని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. కమిటీ చేసే సిఫారసులను అమలు చేయాలా.. వద్దా.. అన్నది పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోని అంశమంది. ఇంటర్ వృత్తి విద్యా కోర్సుల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని నిర్దిష్టకాల వ్యవధిలోపు నివేదిక సమర్పిం చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈమేరకు తాత్కా లిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణతో కూడి న ధర్మాసనం 4 రోజుల కిత్రం ఉత్త ర్వులు జారీ చేసింది. ఇంటర్ వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 2015 సెప్టెంబర్‌లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏర్పాటై 15 నెలలు కావస్తున్నా, ఇప్పటి వరకు నివేదిక సమర్పించలేదని, నిర్దిష్ట గడువులోపు నివేదిక ఇచ్చేలా కమిటీని, కమిటీ సిఫా రసులను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ వృత్తి విద్యా కోర్సుల విద్యా ర్థులు, నిరుద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.ప్రభాకర్ ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఇటీవల ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఓ నిర్దిష్ట పద్ధతిలో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించాలని కోరే హక్కు పిటిషనర్‌కు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. సాధారణంగా ఇటువంటి విషయాల్లో హైకోర్టు రాజ్యాంగంలోని అధికరణ 226 కింద తమకున్న విస్తృతాధికారాలను ఉపయోగించదంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ కోరిన విధంగా నిర్దిష్టకాల వ్యవధి లోపు నివేదిక ఇవ్వాలనిగాని, కమిటీ సిఫార సులను అమలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం గాని చేయలేమని తేల్చి చెప్పింది. -
శివరామకృష్ణన్ మృతికి వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్ : శివరామకృష్ణన్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని వైఎస్ జగన్ అన్నారు. శివరామకృష్ణన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కాగా అనారోగ్యంతో శివరామకృష్ణన్ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం తగిన ప్రదేశం సూచించడానికి కేంద్రం కమిటీని నియమించిన విషయం తెలిసిందే. -
చలో ఢిల్లీ
మీరాకుమారి నివేదికపై ఆగ్రహం దేశ రాజధానికి బయల్దేరిన జాలర్ల సంఘాల నాయకులు నిషేధ కాలానికి జీవన భృతిగా రూ.33 కోట్లు కేటాయింపు సాక్షి, చెన్నై:రాష్ట్రంలో పదమూడు జిల్లాలు సముద్ర తీరంలో ఉన్నాయి. ఇక్కడి జాలర్లకు చేపల వేట తప్ప మరో వృత్తి తెలియదు. ఓ వైపు తమ మీద శ్రీలంక సేనలు దాడులు చేస్తున్నా, మరో వైపు బతుకు తెరువు కోసం కడలిలోకి వెళ్లక తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవల కేంద్రం నియమించిన డాక్టర్ మీరా కుమారి కమిటీ నివేదిక జాలర్లకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. శ్రీలంక సేనల రూపంలో నడి సముద్రంలో చేపల వేట గ గనం అవుతున్న తరుణంలో, చేపల వేటను ప్రైవేటు సంస్థలకు దారాదత్తం చేసే విధంగా నివేదికలో పొందు పరిచిన అంశాలు జాలర్లలో ఆగ్రహాన్ని రేపా యి. చేపల వేట జాలర్లకు మాత్రమే సాధ్యమైనా, ఇక, విదేశాల తరహా ప్రైవేటు సంస్థల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించే విధంగా కొత్త నిబంధనల అమలుకు కేంద్రం యోచిస్తుండడాన్ని తీవ్రంగా పరిగణించారు. నిషేధ కాలం పొడిగింపు, కొత్తగా పర్మిట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం తదితర అంశాలను వ్యతిరేకిస్తూ, మీరా కుమారి నివేదికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పోరు బాటకు జాలర్లు సిద్ధం అయ్యారు. ఇందులో భాగంగా ఛలో ఢిల్లీ నినాదంతో పార్లమెంట్ ముట్టడికి తమిళ జాలర్లతో పాటుగా పలు రాష్ట్రాల్లోని సముద్ర తీర జాలర్ల సంఘాలు పిలుపు నిచ్చాయి. ఛలో ఢిల్లీ : బుధవారం పార్లమెంట్ ముట్టడి లక్ష్యంగా జాలర్ల సమాఖ్యా ఇచ్చిన పిలుపుకు రాష్ట్రంలోని జాలర్లు కదిలారు. ఇప్పటికే కేంద్రంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న రాష్ట్ర జాలర్ల సంఘాల నాయకులు తమ నిరసనను తెలియజేయడం కోసం ఛలో ఢిల్లీ అంటూ పయనం అయ్యారు. జాతీయ జాలర్ల సమాఖ్య నాయకుడు ఇలంగో నేతృత్వంలో తమిళనాడు నుంచి బృందాలు కదిలాయి. నాగపట్నం జాలర్ల సంఘం నాయకుడు తిరునల సెల్వన్ నేతృత్వంలో పన్నెండు మంది, కారైక్కాల్ నేత వీర దాసు నేతృత్వంలో 22 మంది, పుదుకోట్టై నేత కుట్టియాండి నేతృత్వంలో 25 మంది, కన్యాకుమారి, తూత్తుకుడి, రామనాధపురం తదితర జిల్లాలకు చెందిన మొత్తం 250 మందికి పైగా జాలర్ల ప్రతినిధులు తమ తమ ప్రాంతాల నుంచి రైలు మార్గంలో సోమవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. ఈ విషయంగా ఇలంగో పేర్కొంటూ, మీరా కుమారి నివేదిక జాలర్ల జీవితాల మీద ప్రభావం చూపిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నడి సముద్రంలో చేపల వేటను అతి పెద్ద సంస్థలకు అప్పగించే విధంగా 270 నౌకలకు అనుమతి ఇవ్వబోతున్నారని, ఇందులో భాగంగానే కొత్తగా పర్మిట్ల కేటాయింపును ఆ నివేదికలో పొందు పరిచి ఉన్నారని ఆరోపించారు. నౌకల ద్వారా చేపల వేటకు అతి పెద్ద సంస్థలు రంగంలోకి దిగిన పక్షంలో, జాలర్ల చేతికి చిన్న చేప కూడా చిక్కడం అనుమానమేనని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే తమ నిరసనను తెలియజేయడానికి ఢిల్లీకి బయలు దేరామన్నారు. రూ. 33 కోట్లు : జాలర్ల సంఘాల నాయకులు కేంద్రంపై తమ ఆగ్రహాన్ని వెల్లగక్కేందుకు ఢిల్లీకి పయనం అయితే, రాష్ట్ర ప్రభుత్వం జాలర్లను ఆదుకునే విధంగా నిషేద కాలంలో జీవన భృతి కోసం రూ. 33 కోట్లను ప్రకటించింది. ఈ మేరకు సీఎం పన్నీరు సెల్వం ఆదేశాలతో అధికారులు ప్రకటించారు. గత ఏడాది లక్షా 49 వేల 855 జాలర్ల కుటుంబాలకు జీవన భృతి క ల్పించగా, ఈ ఏడాది మరో పది శాతం కుటుంబాలు పెరిగాయి. నిషేద కాలం 45 రోజులా లేదా 65 రోజులా అన్నది ఇంకా స్పష్టతకు రానప్పటికి, ముందస్తుగా జాలర్లను అదుకునేందుకు ఈ నిధుల్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఏడాది లక్షా 65 వేల కుటుంబాల మేరకు జీవన భృతి దక్కే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
చంద్రబాబుకు కోటయ్య కమిటీ నివేదిక
-
చంద్రబాబుకు కోటయ్య కమిటీ నివేదిక సమర్పణ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కోటయ్య కమిటీ సోమవారం తమ నివేదికను సమర్పించింది. బ్యాంకుల నుంచి పూర్తి సమాచారం అందలేదన్న ఆ కమిటీ అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం నివేదికను అందచేసింది. ఇక కోటయ్య కమిటీ తన నివేదికలో రుణాల విలువను తగ్గించి చూపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రుణ మాఫీ పై అధ్యయనం కోసంకోటయ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వాస్తవానికి ఈనెల 22న కమిటీ మధ్యంతర నివేదిక సమర్పించాల్సి ఉంది. 184వ ఎస్ఎల్బీసీ సమావేశంలో మొత్తం రుణాల విలువ రూ.1.02లక్షల కోట్ల పైమాటే అన్న కోటయ్య కమిటీ రుణాల విలువ రూ.72వేలకోట్లుగా పేర్కొంది. తీసుకున్న రుణాల విలువ రూ.72 వేల కోట్లు కాగా, ఇందులో వ్యవసాయ రుణాలు రూ.62వేల కోట్లు, డ్వాక్రా, చేనేత రుణాలు రూ.12వేల కోట్లు, బంగారంపై రుణాలు రూ.34వేల కోట్లు, పంటరుణాలు రూ. 26వేలకోట్లుగా తెలిపింది. మొత్తం మీద కోటయ్య కమిటీ నిర్దిష్ట 45 రోజులలోనే తన తుది నివేదికను సమర్పించింది.