
కమిటీ నివేదికకు గడువు నిర్దేశించలేం
తేల్చి చెప్పిన ఉమ్మడి హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఓ నిర్దిష్ట వ్యవహారానికి సంబం ధించి కమిటీ ఏర్పాటు చేసినప్పుడు అది ఫలానా గడువులోపు నివేదిక ఇవ్వాలని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయలేవని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. కమిటీ చేసే సిఫారసులను అమలు చేయాలా.. వద్దా.. అన్నది పూర్తిగా కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోని అంశమంది. ఇంటర్ వృత్తి విద్యా కోర్సుల విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని నిర్దిష్టకాల వ్యవధిలోపు నివేదిక సమర్పిం చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈమేరకు తాత్కా లిక ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణతో కూడి న ధర్మాసనం 4 రోజుల కిత్రం ఉత్త ర్వులు జారీ చేసింది.
ఇంటర్ వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించే విషయంలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 2015 సెప్టెంబర్‌లో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏర్పాటై 15 నెలలు కావస్తున్నా, ఇప్పటి వరకు నివేదిక సమర్పించలేదని, నిర్దిష్ట గడువులోపు నివేదిక ఇచ్చేలా కమిటీని, కమిటీ సిఫా రసులను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ వృత్తి విద్యా కోర్సుల విద్యా ర్థులు, నిరుద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి.ప్రభాకర్ ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిపై ఇటీవల ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఓ నిర్దిష్ట పద్ధతిలో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించాలని కోరే హక్కు పిటిషనర్‌కు లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. సాధారణంగా ఇటువంటి విషయాల్లో హైకోర్టు రాజ్యాంగంలోని అధికరణ 226 కింద తమకున్న విస్తృతాధికారాలను ఉపయోగించదంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ కోరిన విధంగా నిర్దిష్టకాల వ్యవధి లోపు నివేదిక ఇవ్వాలనిగాని, కమిటీ సిఫార సులను అమలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం గాని చేయలేమని తేల్చి చెప్పింది.