
శివరామకృష్ణన్ మృతికి వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్ : శివరామకృష్ణన్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని వైఎస్ జగన్ అన్నారు. శివరామకృష్ణన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కాగా అనారోగ్యంతో శివరామకృష్ణన్ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం తగిన ప్రదేశం సూచించడానికి కేంద్రం కమిటీని నియమించిన విషయం తెలిసిందే.