Sivaramakrishnan
-
నా జీవితకాలమంతా వర్ణ వివక్ష ఎదుర్కొన్నా.. అది కూడా మన దేశంలోనే...
I have been colour discriminated all my life: భారత క్రికెట్ జట్టు మాజీ లెగ్ స్పిన్నర్, వ్యాఖ్యాత లక్ష్మణ్ శివరామకృష్ణన్ తన జీవితకాలమంతా వర్ణ వివక్షకు గురైనట్లు ట్వీట్ చేశారు. ‘నా రంగుతో నేను వివక్షకు గురయ్యాను. విమర్శలూ ఎదుర్కొన్నాను. నా జీవితమంతా ఇలానే గడిచింది కాబట్టే నన్నేమీ అది బాధించలేదు. దురదృష్టవశాత్తూ ఇది మన దేశంలోనే జరిగింది’ అని ఆయన పోస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన 55 ఏళ్ల శివరామకృష్ణన్ భారత్ తరఫున 1983 నుంచి 1987 మధ్య కాలంలో 9 టెస్టులు ఆడి 26 వికెట్లు, 16 వన్డేలు ఆడి 15 వికెట్లు తీశారు. చదవండి: Hardik Pandya: హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం.. ఇక భారత జట్టుకు..! -
ధోని, కోహ్లిల కెప్టెన్సీపై శివరామకృష్ణన్ విశ్లేషణ
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అద్భుత ఆటతీరు, నాయకత్వంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ తెలిపారు. ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. టీమిండియా మాజీ సారథి(కెప్టెన్) ఎంఎస్ ధోనితో కోహ్లి అనేక మ్యాచ్‌లు ఆడటం వల్ల వైవిధ్యమైన నైపుణ్యాలను అందిపుచ్చుకున్నాడని అన్నారు. అయితే కోహ్లి, ధోని కెప్టెన్సీలు మాత్రం విభిన్నమని విశ్లేషించారు. కోహ్లి తుది జట్టులో అనేక మార్పులు చేస్తాడని, ధోని మాత్రం మార్పులకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడని వెల్లడించారు. కాగా పిచ్‌లను బట్టి కోహ్లి ఆటగాళ్లను ఎంపిక చేస్తాడని, ఉన్నత ప్రమాణాలు, వైవిధ్యంతో బౌలింగ్ చేసే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తాడని తెలిపారు. కాగా నైపుణ్యం కలిగిన బౌలర్లతోనే కోహ్లి అధిక విజయాలు సాధిస్తున్నాడని అభిప్రాయపడ్డారు. అయితే ప్రపంచ క్రికెట్లో మూడు ఐసీసీ టైటిల్స్ నెగ్గిన ఏకైక కెప్టెన్ ధోని అని పేర్కొన్నాడు. ముఖ్యమైన ఐసీసీ టోర్నీలు కోహ్లి సాధించకపోవడంపై ఆయన స్పందిస్తూ.. ఎక్కువ శాతం సెమీఫైనల్ వరకు విజయాలు సాధిస్తున్నాడని, కానీ సెమీఫైనల్లో అతనికి దురదృష్టం వెంటాడుతోందని తెలిపారు. కానీ గత కొంత కాలంగా అన్ని ఫార్మాట్లలో స్థిరమైన ఆటతీరును టీమిండియా ప్రదర్శిస్తోందని కొనియాడారు. అయితే కొన్ని మ్యాచ్‌లలో వివిధ కారణాల వల్ల ధోని జట్టులో లేకపోవడంతో కోహ్లి అద్భుత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని అన్నారు. కాగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారని లక్ష్మణ్ శివరామకృష్ణన్ పేర్కొన్నారు. ( చదవండి: సోషల్ మీడియాకు ధోని దూరంగా!) -
‘అతని వల్లే సచిన్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు’
న్యూఢిల్లీ: సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మన్. సచిన్ పేరిట ఇప్పటికీ పలు రికార్డులు పదిలంగా ఉన్నాయంటే అతని క్రికెట్‌ను ఎంతగానో ఆస్వాదించాడో తెలుస్తోంది. తాను ఓపెనర్‌గా దిగుతానని బ్రతిమాలుకున్న సందర్భాలే కాకుండా ఆ స్థానానికి సచిన్ ఎంతగా వన్నె తెచ్చాడో క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. కాగా, సచిన వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎదగడానికి ఒక మాజీ కెప్టెన్ ప్రోత్సాహం ఉందట. అతను ఎవరో కాదు అగ్రెసివ్ బ్యాట్స్‌మన్‌గా మన్ననలు అందుకున్న కృష్ణమాచారి శ్రీకాంత్. సచిన్ ఎదగడంలో శ్రీకాంత్ పాత్ర మరువలేనిదని మాజీ లెగ్ స్పిన్నర్ శివరామకృష్ణన్ తాజాగా పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన తమిళ క్రికెట్ కనెక్టెడ్ షోలో శివరామకృష్ణన్ పలు విషయాల్ని పంచుకున్నాడు. (అవన్నీ పొరపాట్లే, చింతిస్తున్నా: స్టీవ్ బక్నర్) ‘చీకా(కృష్ణమాచారి శ్రీకాంత్) అగ్రెసివ్ బ్యాట్స్‌మనే కాదు.. అగ్రెసివ్ కెప్టెన్ కూడా. ఫలితాలు సాధించడం ద్వారానే చీకా ఏమిటో నిరూపించుకున్నాడు. అతను చాలా చురకైన వాడు. సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాడు చీకా కెప్టెన్సీలో అరంగేట్రం చేశాడు. సచిన్‌ను చీకా బాగా ప్రోత్సహించాడు. చీకా ఇచ్చిన సహకారంతోనే అప్పుడు యుక్త వయసులో ఉన్న సచిన్‌లో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. అది అతన్ని వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలబెట్టింది. మనం చాలా మంది స్ఫూర్తిదాయకమైన కెప్టెన్లను చూశాం. అందులో చీకా ఒకడు. అతను సుదీర్ఘ కాలం భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా చేస్తాడనుకున్నా అది జరగలేదు. నాకు చీకా కెప్టెన్సీ అంటే ఇష్టం. చాలా తక్కువ సమయం మాత్రమే చీకా కెప్టెన్‌గా ఉండటం నన్ను తీవ్ర నిరాశకు గురి చేసింది’ అని శివరామకృష్ణన్ తెలిపాడు. కేవలం 4 టెస్టులు, 13 వన్డేలకు మాత్రమే కృష్ణమాచారి శ్రీకాంత్ కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతిని శివరామకృష్ణన్ పరోక్షంగా ప్రస్తావించాడు. ఇక తన కెరీర్ కూడా తొందరగా ముగిసిపోవడంపై శివరామకృష్ణన్ పెదవి విప్పాడు. తనకు అంతర్జాతీయ క్రికెట్లో తక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించినా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిదన్నాడు. గావస్కర్ మార్గనిర్దేశంలో గైడెన్స్ తనకు ఎంతగానో ఉపయోగిపడిందన్నాడు. భారత్ తరఫున శివరామకృష్ణన్ 9 టెస్టులు, 16 వన్డేలను మాత్రమే ఆడాడు. -
శివరామకృష్ణన్ మృతికి వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్ : శివరామకృష్ణన్ మృతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని వైఎస్ జగన్ అన్నారు. శివరామకృష్ణన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కాగా అనారోగ్యంతో శివరామకృష్ణన్ గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. మాజీ ఐఏఎస్ అధికారి అయిన ఆయన నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం తగిన ప్రదేశం సూచించడానికి కేంద్రం కమిటీని నియమించిన విషయం తెలిసిందే. -
రాయపాటి... ఇదేం పరిపాటి?
తమకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై ఎదురుదాడి చేయడం టీడీపీ నాయకులకు అలవాటుగా మారుతోంది. రాజధాని ఏర్పాటు విషయంలోనూ ఇదే విద్య ప్రదర్శిస్తున్నారు సైకిల్ పార్టీ నేతలు. నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలపై దానిపై సూచనలు, సలహాలు ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులపై చిందులేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అక్కడితో ఆగకుండా నోటికొచ్చినట్టు ఆరోపణలు చేసేస్తున్నారు. ఎన్నికలకు ముందు 'హస్తం' గూటి నుంచి బయటకు వచ్చి పచ్చ కండువా కప్పుకున్న ఎంపీ రాయపాటి సాంబశిరావు- శివరామకృష్ణన్ కమిటీ సభ్యులపై తీవ్రారోపణలు చేశారు. కమిటీలోని కొంత మంది సీనియర్ సభ్యులు దొనకొండ, చుట్టుపక్కల ప్రాంతంలో భూములు కొన్నారని ఆయన ఆరోపించారు. అందుకోసమే ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని కమిటీ సూచించిందని శివమెత్తారు. కమిటీని కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రభావితం చేశారన్న విషయం తనకు తెలుసునని చెప్పుకొచ్చారు. ఇక కమిటీ నివేదిక పట్ల సీఎం చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కమిటీ దొనకొండలో పర్యటించినప్పటికీ... అక్కడకు కమిటీ సభ్యులు వెళ్లలేదని రాయపాటి చెప్పడం గమనార్హం. కమిటీపై ఆరోపణలు చేసిన రాయపాటికి కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం కౌంటర్ ఇచ్చారు. వ్యాపార ప్రయోజనాల కోసమే రాయపాటి రెచ్చిపోతున్నారని అన్నారు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాభివృద్ధి కోసం విజయవాడగుంటూరు-తెనాలిమంగళగిరి(వీజీటీఎం)లో రాజధాని ఏర్పాటు కావాలని టీడీపీ నేతలు కోరుకున్నారని చెప్పారు. కమిటీ నివేదికతో రాయపాటి సహా టీడీపీ కంగుతిన్నారని ఎద్దేవా చేశారు. సమర్థులైన అధికారులతో కూడిన శివరామకృష్ణన్ కమిటీపై రాయపాటి ఆరోపణలు చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. తమకు నచ్చనివారిపై నిందలు వేయడం పచ్చ బాబులకు పరిపాటిగా అంటున్నారు. -
హైటెక్ జోన్‌గా విశాఖ.. పారిశ్రామిక ప్రాంతంగా కోస్తాంధ్ర..
-
కేంద్ర హోంశాఖకు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక