
I have been colour discriminated all my life: భారత క్రికెట్ జట్టు మాజీ లెగ్ స్పిన్నర్, వ్యాఖ్యాత లక్ష్మణ్ శివరామకృష్ణన్ తన జీవితకాలమంతా వర్ణ వివక్షకు గురైనట్లు ట్వీట్ చేశారు. ‘నా రంగుతో నేను వివక్షకు గురయ్యాను. విమర్శలూ ఎదుర్కొన్నాను.
నా జీవితమంతా ఇలానే గడిచింది కాబట్టే నన్నేమీ అది బాధించలేదు. దురదృష్టవశాత్తూ ఇది మన దేశంలోనే జరిగింది’ అని ఆయన పోస్ట్ చేశారు. తమిళనాడుకు చెందిన 55 ఏళ్ల శివరామకృష్ణన్ భారత్ తరఫున 1983 నుంచి 1987 మధ్య కాలంలో 9 టెస్టులు ఆడి 26 వికెట్లు, 16 వన్డేలు ఆడి 15 వికెట్లు తీశారు.
చదవండి: Hardik Pandya: హార్దిక్ పాండ్యా సంచలన నిర్ణయం.. ఇక భారత జట్టుకు..!