మోదీ సర్కార్‌ బిగ్‌ ప్లాన్‌.. తెరపైకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు? | BJP Plan For One Nation One Election Bill In Parliament Special Session - Sakshi
Sakshi News home page

ప్రత్యేక సమావేశాలు.. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుకు బీజేపీ ప్లాన్‌!

Published Thu, Aug 31 2023 7:00 PM | Last Updated on Thu, Aug 31 2023 8:20 PM

BJP Plan For One Nation One Election Bill In Parliament Special Session - Sakshi

సాక్షి, ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని మోదీ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో పార్లమెంట్‌ అమృత్‌కాల్‌ స్పెషల్‌ సెషన్‌ను ప్రకటించింది. సెప్టెంబర్‌ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే, ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టనుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. 

సమాచారం మేరకు.. పార్లమెంట్‌ ప్రత్యేక సెషన్‌లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక దేశం.. ఒకే ఎన్నిక బిల్లు పెట్టే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. వన్ నేషన్, వన్ ఎలక్షన్ ద్వారా లోక్‌సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను అధ్యయనం చేసిన లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 

కాల పరిమితి పెంపు, తగ్గింపు..
ఇక.. ప్రస్తుతం లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు సాధారణంగా వాటి గడువు ముగిసిన తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అయితే..  వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఐడియా కింద, లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే వన్ నేషన్, వన్ ఎలక్షన్ కింద కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితి పెంచడం, మరికొన్ని అసెంబ్లీల కాలపరిమితి తగ్గింపు ఉంటుందని తెలుస్తోంది. కాగా, రాబోయే ప్రత్యేక సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశముంది. బిల్లు ఆమోదానికి 2/3 వంతు మెజారిటీతో రాజ్యాంగ సవరణ అవసరం ఉంటుంది. 

ఇది కూడా చదవండి: జమ్ములో ఏ క్షణమైనా ఎన్నికల నిర్వహణకు సిద్ధం: కేంద్రం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement