
చండీగఢ్: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ ప్రతిపాదనను తాము వ్యతిరేకిస్తున్నామని ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. జమిలి ఎన్నికల వల్ల సామాన్య ప్రజలకు ఉపయోగం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం హరియాణాలోని భివానీలో ఎన్నికల ప్రచార సభలో కేజ్రివాల్ ప్రసంగించారు. ఏదో ఒక రోజు బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ దేశం నుంచి తుడిచిపెట్టేస్తుందని అన్నారు. ఒకే దేశం–ఒకే ఎన్నిక అవసరం లేదని, ఒకే దేశం–ఒకే విద్య కావాలని ఆకాంక్షించారు.
ధనవంతులకు, పేదలకు ఒకేరకరమైన విద్య అందించాలన్నారు. ఒకే దేశం–100 ఎన్నికలు, ఒకే దేశం–1,000 ఎన్నికలు అయినా సామాన్య ప్రజలకు పెద్దగా తేడా ఏమీ ఉండదని స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలు అవసరం లేదని తేలి్చచెప్పారు. ఉచిత పథకాలు అంటూ కొందరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పేదలకు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించడం నేరమా? పాపమా? అని ప్రశ్నించారు. హరియాణాలో బీజేపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేజ్రివాల్ మండిపడ్డారు.