రాజ్యాంగ, చట్ట సవరణలు అవసరం
కోవింద్ కమిటీ సూచన
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలంటే 18 రాజ్యాంగ, చట్ట సవరణలు అవసరమవుతాయి. కమిటీ ఈ విషయాన్ని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్లతో సంప్రదించి భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఓటర్ల జాబితాను రూపొందించాల్సి ఉంటుంది.
దానికోసం రాజ్యాంగంలోని ఆరి్టకల్ 325ని సవరించాల్సి ఉంటుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటే మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటే ‘ఆరి్టకల్ 324ఏ’కు సవరణ అవసరం. ఈ రెండు అంశాలు రాష్ట్రాల పరిధిలోకి వచ్చేవి కాబట్టి రాజ్యాంగ సవరణలు చేయాలంటే ఆర్టికల్ 368(2) ప్రకారం దేశంలోని సగం రాష్ట్రాలు సమ్మతి తెలపాల్సి ఉంటుందని కోవింద్ కమిటీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment