ఢిల్లీ: ఒకే దేశం-ఒకే ఎన్నిక విధానంపై గత కొంత కాలంగా దేశంలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. తాజాగా ఈ అంశం మరోసారి తెరమీదికి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే ఈ విధానం తప్పకుండా అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఇదే విషయాన్ని నొక్కిచెప్పినట్ల సంబంధిత అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక.. ఇప్పటికే ఒకే దేశం- ఒకే ఎన్నిక విధానం అమలు చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఆ కమిటీ ప్యానెల్ మొదటి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. వాటీ తర్వాత సుమారు వంద రోజుల వ్యవధితో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. ఈ కమిటీ తర్వలోనే లా కమిషన్‌కు కూడా సిఫారసు చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇక ఏకకాలంలో లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలను 2029లో నిర్వహించాలని ఇటువంటి పరిస్థితిలో ఒకవేళ హంగ్ ప్రభుత్వం ఏర్పడితే, లేదా అవిశ్వాస తీర్మానం వంటి సందర్భంలో ఏకీకృత ప్రభుత్వం కోసం ఓ ప్రత్యేకమైన నిబంధనను రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆగస్టులో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ.. ‘ఒక దేశం, ఒకే ఎన్నిక’ అవసరాన్ని నొక్కి చెప్పారు. దశలవారిగా తరచూ ఎన్నికలు నిర్వహించటం.. దేశ పురోగతికి అడ్డంకులు సృష్టిస్తున్నాయని తెలిపారు.
లోక్ సభ ఎన్నికల సమయంలో బీజేపీ ఈ అంశాన్ని ఎన్నకల మేనిఫెస్టోలో సైతం పొందుపర్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విధానాన్ని దానిని అమలు చేయడానికి అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ విధానాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకేసారి ఎన్నికల నిర్వహిస్తే.. లోక్‌సభ ఎన్నికలపై నేపథ్యంలో ఓటర్లకు స్థానిక సమస్యలను వివరించడానికి తగిన ప్రాధాన్యత ఉండదని ప్రాంతీయ పార్టీలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment