PP Chaudhary
-
ఏకాభిప్రాయంతోనే మహిళా రిజర్వేషన్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఏకాభిప్రాయంతోనే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు సాధ్యమవుతాయని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి స్పష్టం చేశారు. శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం మూలనపడేయడానికి కారణాలు ఏమిటని, అసలు ఈ బిల్లు పట్ల ప్రభుత్వ దృక్పథం ఏమిటని, రాజ్య సభలోఇప్పటికీ ఆమోదం పొందిన ఈ బిల్లును లోక్ సభ ఆమోదం పొందడానికి ఉన్న ఆటంకం ఏమిటని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. చట్ట సభల్లో 33 శాతం స్థానాలను మహిళలకు రిజర్వ్ చేసే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన 108వ రాజ్యాంగ బిల్లును 2010 మార్చి 9న రాజ్యసభ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. ఆ బిల్లు 15వ లోక్ సభ ఆమోదం పొందకుండా పెండింగ్‌లో ఉండిపోయిందని.15వ లోక్ సభ రద్దు కావడంతో బిల్లు కాలపరిమితి కూడా దాటిపోయిందని వివరించారు. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే అన్ని రాజకీయ పక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చి ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతే ఈ బిల్లు ఆమోదం చేపట్టే రాజ్యాంగ సవరణను పార్లమెంట్ ముందుకు తీసుకురావడం జరుగుతుందని పేర్కొన్నారు. -
చెప్పినా బెగ్గింగ్ అన్న కేంద్ర మంత్రి, వద్దన్న వెంకయ్య
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో ఇకపై బెగ్గింగ్ అనే పదం వాడొద్దని చెప్పినా ఓ మంత్రి ఉపయోగించారు. దాంతో ఆ మంత్రి ప్రసంగం ప్రారంభిస్తుండగానే దయచేసి ఆ పదాన్ని ఉపయోగించకండి అని రాజ్యసభ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు సూచించారు. సాధారణంగా రాజ్యసభలో ఏదైనా బిల్లును ప్రవేశపెట్టే సమయంలో 'ఐ బెగ్ టూ'(నేను వేడుకుంటున్నాను) అని అంటుంటారు. అయితే, ఈ పార్లమెంటు సమావేశాల ప్రారంభ సమయంలోనే ఐ బెగ్ టూ అనే పదం వలసవాదానికి నిదర్శనం అని, ఇప్పుడు అందరం స్వతంత్ర్య భారతంలో జీవిస్తున్నామని, ఆంగ్లేయులు విడిచి వెళ్లిన ఆపదాన్ని విడిచి 'నేను లేవనెత్తుతున్నాను' అనే పదం ఉపయోగించాలని వెంకయ్యనాయుడు చెప్పారు. అయితే, శుక్రవారంనాటి సమావేశంలో కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి పీపీ చౌదరీ 'ఐ బెగ్ టూ' అనే పదం ఉపయోగించారు. దీనికి వెంటనే స్పందించిన వెంకయ్య ఆ పదం ఉపయోగించొద్దన్నారు. బహుషా తొలిరోజు సమావేశాల సమయంలో చౌదరీ లేకపోయి ఉండొచ్చని, అందుకే మళ్లీ గుర్తు చేస్తున్నానని, ఎంపీలు ఎవరూ ఆ పదం ఉపయోగించవద్దని పునరుద్ఘాటించారు. వాస్తవానికి వెంకయ్యనాయుడు చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఎంపీ కూడా ఆ పదం ఉపయోగించలేదు. -
‘సంతోషంగా అంగీకరిస్తా’
న్యూఢిల్లీ: కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) స్టే విధించడాన్ని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్వాగతించారు. ఈ కేసు విచారణలో పాకిస్తాన్ అనుసరించిన విధానం సవ్యంగా లేదని ఆయన విమర్శించారు. కులభూషణ్.. భారత రాయబారిని కలిసిన తర్వాత అతడికి విధించిన మరశిక్షపై అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అతడికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. జాధవ్ కుటుంబానికి సాయం చేసేందుకు సంతోషంగా అంగీకరిస్తానని చెప్పారు. కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షపై ఐసీజే స్టే విధించడం పట్ల దేశం చాలా సంతోషంగా ఉందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌధరి వ్యాఖ్యానించారు. జాధవ్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ వద్ద ఎటువంటి ఆధారాలు లేవన్నారు. అతడికి వ్యతిరేకంగా సాగిన విచారణ చట్టవిరుద్ధమని, దుర్మార్గమని పేర్కొన్నారు. -
ఐదుగురికి ‘సంసద్ రత్న’
చెన్నై: ఐదుగురు ఎంపీలు శనివారం రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ సి. రంగరాజన్ చేతుల మీదుగా ‘సంసద్ రత్న’ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డులను ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్, ఈ మ్యాగజైన్ ప్రీసెన్స్ అందించాయి. వీరిలో రాజస్తాన్‌కు చెందిన పి.పి. చౌదరి(బీజేపీ), మహారాష్ట్రకు చెందిన హీనా విజయ్‌కుమార్ గావిట్(బీజేపీ), శ్రీరంగ్‌అప్పా బర్నే(శివసేన), రాజీవ్ సతాల్(కాంగ్రెస్), షిరూర్(శివసేన) ఉన్నారు. షిరూర్ మినహా నలుగురూ తొలిసారి లోక్‌సభకి ఎన్నికైన వారు. మాజీ రాష్ట్రపతి కలాం పేరిట ఈ అవార్డులు ఇస్తున్నారు. అవార్డు విజేతలు క్రమం తప్పకుండా పార్లమెంటుకు హాజరై 300-500 ప్రశ్నలను లేవనెత్తారు.