ఐశ్వర్య దర్శకత్వంలో 'సినిమా వీరన్' | Aishwarya Dhanush Cinema veeran a documentary about Stuntmen of Tamil Cinema | Sakshi
Sakshi News home page

ఐశ్వర్య దర్శకత్వంలో 'సినిమా వీరన్'

Published Sun, Oct 2 2016 11:15 AM | Last Updated on Sat, Aug 11 2018 8:29 PM

ఐశ్వర్య దర్శకత్వంలో 'సినిమా వీరన్' - Sakshi

ఐశ్వర్య దర్శకత్వంలో 'సినిమా వీరన్'

సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురుగా, హీరో ధనుష్ భార్యగా ఐశ్వర్య ధనుష్ సినీ అభిమానులకు సుపరిచితురాలే. అయితే తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న ఈ స్టార్ వారసురాలు, ప్రస్తుతం దర్శకురాలిగా నిలదొక్కుకునేందుకు కష్టపడుతోంది. ఇప్పటికే ధనుష్ హీరోగా 3 సినిమాను డైరెక్ట్ చేసిన ఐశ్వర్య ఆ సినిమాతో ఆశించిన స్థాయి విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం సినిమా నేపథ్యంలో ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించే పనిలో బిజీగా ఉంది.

సినీ రంగంలోని 24 శాఖల్లో ఒకటైన స్టంట్ డైరెక్టర్ల కష్టాలు, వారి జీవనశైలి, వారికి ఉన్న ఇబ్బందుల నేపథ్యంలో సినిమా వీరన్ పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది ఐశ్వర్య. తానే స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి సూపర్ స్టార్ రజనీకాంత్ వాయిస్ ఓవర్ అంధిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ నేపథ్యం సంగీతం అందిస్తున్నాడు. త్వరలో రిలీజ్ చేయనున్న ఈ డాక్యుమెంటరీని కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాండ్ కాస్టింగ్ మినిస్టర్ వెంకయ్య నాయుడుకు చూపించిన ఐశ్వర్య, ఇన్నాళ్లుగా జాతీయ అవార్డుల్లో ఫైట్ మాస్టర్ క్యాటగిరీ లేకపోవటంపై విచారం వ్యక్తం చేశారు. ఈ ఏడాది నుంచి ఫైట్ మాస్టర్లకు కూడా జాతీయ అవార్డును అందించాలని కేంద్రాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement