షారూఖ్ రిలీజ్ చేసిన బయోపిక్ పోస్టర్ | Shah Rukh Khan unveils first look poster of mariyappan | Sakshi
Sakshi News home page

షారూఖ్ రిలీజ్ చేసిన బయోపిక్ పోస్టర్

Published Sun, Jan 1 2017 1:31 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

షారూఖ్ రిలీజ్ చేసిన బయోపిక్ పోస్టర్

షారూఖ్ రిలీజ్ చేసిన బయోపిక్ పోస్టర్

ప్రస్తుతం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్ల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవితాలను వెండితెర మీద ఆవిష్కరించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు ఫిలింమేకర్స్. అదే బాటలో దక్షిణ భారత క్రీడాకారుడు మరియప్పన్ తంగవేళు జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు.

2016 సమ్మర్లో రియోలో జరిగిన పారాఒలింపిక్స్లో భారత్ తరుపున హై జంప్లో స్వర్ణపతకం సాధించిన మరియప్పన్ జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమా పోస్టర్ను తన ట్విట్టర్లో రిలీజ్ చేసిన కింగ్ ఖాన్ ' భారత హీరో మరియప్పన్ తంగవేళు జీవితకథతో తెరకెక్కిన మరియప్పన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్. ఆల్ ద బెస్ట్ ఐశ్వర్య ధనుష్' అంటూ కామెంట్ చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement