mariyappan thangavelu
-
చరిత్ర సృష్టించిన తంగవేలు.. మనసును కదిలించే కథ
భారత పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలు సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో T63 హై జంప్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించాడు.జపాన్‌లోని కోబేలో జరిగిన ఈవెంట్లో 1.88 మీటర్లు దూకి పసిడి ఒడిసిపట్టాడు 28 ఏళ్ల తంగవేలు. అంతేకాదు పనిలో పనిగా శరత్ కుమార్ పేరిట ఉన్న(1.83 మీటర్లు) రికార్డు కూడా బద్దలు కొట్టాడు.మనసును కదిలించే కథతమిళనాడుకు చెందిన మరియప్పన్ తంగవేలు ఐదేళ్ల వయసులో ఘోర ప్రమాదానికి గురయ్యాడు. తాగి బస్సు నడిపిన వ్యక్తి నిర్లక్ష్యం కారణంగా తన కుడికాలును శాశ్వతంగా పోగొట్టుకున్నాడు.అయితే, తంగవేలు చదివే పాఠశాలలోని పీఈటీ సర్ అతడిని ఎంతగానో ఎంకరేజ్ చేశాడు. ఒంటికాలితోనే హై జంప్‌లో రాణించేలా శిక్షణ ఇచ్చాడు.తల్లే తండ్రిగా మారి.. రోజూ వారీ కూలీగాతంగవేలు బాల్యం కూడా కష్టంగా గడిచింది. అతడి తల్లి రోజూ వారీ కూలీ. కొడుకును పోషించుకునేందుకు అప్పుడప్పుడు కూరగాయలు కూడా అమ్మేవారు.ఇలాంటి ఒడిదుడుకుల నడుమ పాఠశాల విద్య పూర్తి చేసిన తంగవేలు బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించాడు. చదువుకుంటూనే ఆటపై కూడా దృష్టి సారించిన అతడు జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించాడు.పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్అంచెలంచెలుగా ఎదిగిన తంగవేలు 2016 రియో పారాలింపిక్స్‌లో పసిడి పతకం గెలిచాడు. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో మాత్రం రజతంతో సరిపెట్టుకున్నాడు.అందుకున్న పురస్కారాలుహై జంప్‌లో విశేష ప్రతిభ కనబరిచిన తంగవేలును భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అదే విధంగా అర్జున అవార్డు కూడా ప్రదానం చేసింది. ఇక తంగవేలు 2020లో అత్యుత్తమ క్రీడా పురస్కారం ఖేల్ రత్న అందుకున్నాడు. ధ్యాన్ చంద్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.డబ్బు మొత్తం వాటికే ఖర్చు పెట్టివివిధ టోర్నీల్లో పతకాలు గెలవడం ద్వారా సంపాదించిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తంగవేలు పొలాలు కొనేందుకు వినియోగించాడు. తన తల్లి కోసం ఇంటిని కూడా నిర్మించాడు.చదవండి: MS Dhoni: ఐపీఎల్‌కు గుడ్‌బై?.. ధోని కీలక వ్యాఖ్యలు That's Mariyappan Thangavelu. Just few hours back he won India's 🇮🇳 first ever Gold Medal in High Jump at World Para Athletics. Media won't share stories of such incredible athletes. But should know more about him.At the age of 5, he met with an accident where a drunk bus… pic.twitter.com/d4zaKEXJR5— Dilip Kumar (@kmr_dilip) May 22, 2024 -
ఫేస్ టు ఫేస్ విత్ మరియప్పన్ తంగవేలు
-
షారూఖ్ రిలీజ్ చేసిన బయోపిక్ పోస్టర్
ప్రస్తుతం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవితాలను వెండితెర మీద ఆవిష్కరించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు ఫిలింమేకర్స్. అదే బాటలో దక్షిణ భారత క్రీడాకారుడు మరియప్పన్ తంగవేళు జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు. 2016 సమ్మర్లో రియోలో జరిగిన పారాఒలింపిక్స్‌లో భారత్ తరుపున హై జంప్‌లో స్వర్ణపతకం సాధించిన మరియప్పన్ జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమా పోస్టర్‌ను తన ట్విట్టర్లో రిలీజ్ చేసిన కింగ్ ఖాన్ ' భారత హీరో మరియప్పన్ తంగవేళు జీవితకథతో తెరకెక్కిన మరియప్పన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్. ఆల్ ద బెస్ట్ ఐశ్వర్య ధనుష్' అంటూ కామెంట్ చేశాడు. Here's presenting the first look of the biopic on #MariyappanThangavelu, our very own national hero, all the best @ash_r_dhanush pic.twitter.com/oD1avhkC4K — Shah Rukh Khan (@iamsrk) 31 December 2016 -
పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం, కాంస్యం
-
తంగ మారి
సాక్షి, చెన్నై : రియో పారాలింపిక్ హైజంప్ విభాగంలో తమిళ తేజం మారియప్పన్ తంగవేలు బంగారం దక్కించుకున్న విషయం తెలిసిందే. తమ గ్రామం పేరు ప్రపంచ దేశాల్లో మార్మోగే రీతిలో తన సత్తాను చాటిన మారియప్పన్ తంగ వేలును ఇక తంగ మారిగా పిలిచేందుకు పెరియవడగం పట్టి వాసులు నిర్ణయించారు. తంగం..తంగమే (బంగారం..బంగారమే) అంటూ తంగమారిగా ఈ రియో హీరో పేరు మార్చే పనిలో పడ్డారు. సేలం జిల్లా ఓమలూరు డివిజన్ పరిధిలోని పెరియవడగం పట్టిలో ఉన్న తంగ మారి తల్లిదండ్రులు తంగ వేలు, సరోజ, సోదరీ, సోదరులు ఆనందంలో ఊబ్బి తబ్బి అవుతున్నారు. తమ వాడికి ప్రశంసలతో పాటుగా కానుకలు వస్తుండటంతో ఇక, అద్దె ఇంటి నుంచి సొంత ఇంట్లోకి అడుగు పెట్టాలన్న కాంక్ష ఆ కుటుంబంలో పెరిగి ఉన్నది. అయితే, పెరియ వడగం పట్టిలోనే సొంత ఇళ్లు నిర్మించుకుంటామని, బయట ఎక్కడకు వెళ్లబోమని సరోజ వ్యాఖ్యానించారు. ‘తంగం’ వచ్చాకే సొంత ఇంటి నిర్మాణంపై దృష్టి పెడుతామన్నారు. తన కుమారుడితో ఫోన్లో మాట్లాడినట్టు, అతడి రూపంలో తమ కుటుంబ కష్టాలు కొంత మేరకు తీరనున్నదని ఆనందం వ్యక్తంచేశారు. ఇక, తనకు వస్తున్న కానుకల్లో కొంత భాగాన్ని పెరియవడగం పట్టి పాఠశాలకు వెచ్చించేందుకు తంగ మారి నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ విషయంగా ఆ స్కూల్ పీఈటీ రాజేంద్రన్ పేర్కొంటూ, స్కూల్ హోదా పెంపు, క్రీడా మైదానం అభివృద్ధి గురించి తనతో తంగం మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఇరవై లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు సిద్ధం అవుతున్నాడని వ్యాఖ్యానించారు. ఈనెల 22న స్వగ్రామానికి మారి రానున్నాడని, అతడ్ని ఆహ్వానించే విధంగా భారీ ఏర్పాట్లు చేయనున్నామన్నారు. తమ గ్రామానికి ముందుగానే ఆయుధ పూజ వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. ఆ గ్రామ యువత పేర్కొంటూ, తంగ మారి సౌమ్యుడు అని, సందేశాత్మక ఆంగ్ల చిత్రాలను ఎక్కువగా చూసే వాడని వివరించారు. హాలీవుడ్ హీరో సిల్వస్టర్ స్టాలిన్ చిత్రాలను మరింతగా ఇష్టపడి చూసేవాడని, బీబీఈ తదుపరి ఎంబీఏ చేయాలన్న ఆశ అతడిలో ఉందని వ్యాఖ్యానించడం విశేషం. -
తండ్రి నిరాదరణ.. కటిక దారిద్ర్యం.. ఆపై స్వర్ణం!
-
తండ్రి నిరాదరణ.. కటిక దారిద్ర్యం.. ఆపై స్వర్ణం!
రియో డీ జనీరో: నిన్న మొన్నటివరకు ఎవరికీ పెద్దగా తెలియని తమిళనాడుకు చెందిన తంగవేలు పేరు ఇప్పుడు మార్మోగుతోంది. ఇందుకు కారణం రియో పారాలింపిక్స్‌లో స్వర్ణంతో సత్తా చాటడమే. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని 21 ఏళ్ల తంగవేలు నిరూపించాడు. కటిక దరిద్రాన్ని అనుభవించి నిలచిన తంగవేలు జీవితం ఇప్పుడు అందిరికీ స్ఫూర్తిదాయకం. తమిళనాడు రాష్ట్రంలోని సేలం జిల్లాలోని ఓ చిన్నగ్రామం తంగవేలుది. తంగవేలుకు ఐదు సంవత్సరాల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదం అతని జీవితంలో చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. స్కూల్ కు వెళ్తుండగా తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తంగవేలు ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అతని కుడి మోకాలు తీవ్రంగా దెబ్బతింది. దీంతో అతని జీవితంలో అలుముకున్న చీకటిని జయించడానికి తల్లి విశ్వప్రయత్నమే చేసింది. మరియప్పన్ తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోవడంతో ఆ భారం తల్లికి మరింత ఎక్కువైంది. ఒక గదిలో 500 రూపాయిలకు అద్దెకు ఉంటూనే కూరగాయలు వ్యాపారం చేసుకునే మరియప్పన్ తల్లి.. కుమారుని వైద్యం కోసం మూడు లక్షల అప్పు తీసుకుంది. అయితే ఆ అప్పుతీర్చడానికి అతని తల్లి పడని కష్టాలంటూ లేవు. ఇదంతా ఒక ఎత్తైతే.. అతనిలోని ప్రతిభ గుర్తించింది మాత్రం కోచ్ సత్యనారాయణ. 2013 లో జరిగిన పారా అథ్లెటిక్స్ చాంపియన్స్షిప్లో తంగవేలు సత్తాచాటడంతో అతనిలో అపారమైన నైపుణ్యం ఉందని కోచ్ భావించాడు. దీనిలో భాగంగా అతన్ని ప్రత్యేక శిక్షణ కోసం బెంగళూరు తీసుకొచ్చాడు. అదే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. గతేడాది జరిగిన సీనియర్ లెవల్ పోటీలో తంగవేలు టీ-42 కేటగిరీలో వరల్డ్ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది ట్యునిసియాలో జరిగిన క్వాలిఫికేషన్ పోటీల్లో సత్తా చాటి రియోకు అర్హత సాధించాడు. పారాలింపిక్స్‌లో పతకమే లక్ష్యంగా అక్కడకు వెళ్లిన తంగవేలు.. పసిడితో యావత్ భారతాన్ని ఆనందంలో ముంచెత్తాడు. -
మరియప్పన్‌కు భారీ నజరానా
చెన్నై: పారాలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు తమిళనాడులోని జయలలిత ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. తంగవేలును ప్రత్యేకంగా అభినందించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలిత.. ఆ అథ్లెట్‌కు రూ. 2 కోట్ల నజరానా ప్రకటించింది. మరోవైపు పారాలింపిక్స్‌లో సత్తాచాటిన మరియప్పన్, వరుణ్ సింగ్ భాటిలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్ పేజీలో అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉండగా రియోకు వెళ్లేముందే అథ్లెట్లను ప్రొత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. పారాలింపిక్స్ లో స్వర్ణం సాధిస్తే రూ.75 లక్షలు, అలాగే రజతానికి రూ.50 లక్షలు, కాంస్య పతకానికి రూ.30 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రెజిల్‌లోని రియో డి జనీరోలు జరుగుతున్న పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో పాల్గొన్న మరియప్పన్ 1.89 మీటర్లు జంప్ చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు. -
మరియప్పన్ కు రూ. 75 లక్షలు..
రియో: బ్రెజిల్‌లోని రియో డి జనీరోలు జరుగుతున్న పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత అథ్లెట్ మరియప్పన్ తంగవేలు రూ. 75 లక్షల నజరానాను కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకోనున్నాడు. దాంతో పాటు కాంస్య పతకం సాధించిన మరో అథ్లెట్ వరుణ్ భాటికి రూ. 30 లక్షల నగదు పురస్కారం దక్కనుంది. భారత అథ్లెట్లు పారాలింపిక్స్ కు వెళ్లేముందు వారిని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నజరానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. పారాలింపిక్స్ లో స్వర్ణ సాధిస్తే రూ.75 లక్షలు, అలాగే రజతానికి రూ.50 లక్షలు, కాంస్య పతకానికి రూ.30 లక్షలు ఇవ్వనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు మరియప్పన్ కు రూ.75 లక్షలు, భాటికి రూ.30 లక్షలు నజరానా దక్కనుంది. భారత్ నుంచి ఈసారి 17 మందితో కూడిన బృందం ఈ గేమ్స్‌కు వెళ్లింది. పారా ఒలింపిక్స్ ఆరంభమైన రెండు రోజుల్లోనే భారత ఖాతాలో పతకాలు చేరడంపై ఆ అథ్లెట్లపై ప్రశంసల వర్షం కురస్తోంది. పారాలింపిక్స్‌లో సత్తాచాటిన మరియప్పన్, భాటిలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్ పేజీలో అభినందనలు తెలియజేశారు.మరోవైపు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా వారిని అభినందిస్తూ ట్వీట్ చేశాడు. రియోలో మరిన్ని పతకాలు సాధించి భారత కీర్తిని మరింత పెంచాలంటూ ఆకాంక్షించాడు. రియో పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో భారత అథ్లెట్లు స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హైజంప్ టీ-42 విభాగంలో మరియప్పన్ తంగవేలు 1.89 మీటర్లు హైజంప్ చేసి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకోగా, మరో భారత అథ్లెట్ వరుణ్ సింగ్ భాటి 1.86 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకం నెగ్గాడు. అమెరికాకు చెందిన సామ్ గ్రీవె రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. -
రియోలో భారత్‌కు స్వర్ణం, కాంస్యం
పారాలింపిక్స్‌లో భారత్ రెండు పతకాలు కైవసం చేసుకుంది. రియో పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో భారత అథ్లెట్లు స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హైజంప్ టీ-42 విభాగంలో మరియప్పన్ తంగవేలు 1.89 మీటర్లు హైజంప్ చేసి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకోగా, మరో భారత అథ్లెట్ వరుణ్ సింగ్ భాటి 1.86 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకం నెగ్గాడు. అమెరికాకు చెందిన సామ్ గ్రీవె రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు. పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్ మరియప్పన్. కాగా, వ్యక్తిగత స్వర్ణం నెగ్గిన మూడో భారత అథ్లెట్ గా నిలిచాడు. గతంలో స్విమ్మింగ్, జావెలిన్ త్రో విభాగాలలో భారత్ వ్యక్తిగత స్వర్ణాలు కైవసం చేసుకుంది. పారాలింపిక్స్ లో ఓవరాల్ గా భారత్ పతకాల సంఖ్య 10కి చేరింది.