మరియప్పన్‌కు భారీ నజరానా | tamilnadu cm jayalalitha announced cash awards to Mariyappan Thangavelu | Sakshi
Sakshi News home page

మరియప్పన్‌కు భారీ నజరానా

Published Sat, Sep 10 2016 2:13 PM | Last Updated on Mon, Sep 4 2017 12:58 PM

మరియప్పన్‌కు భారీ నజరానా

మరియప్పన్‌కు భారీ నజరానా

చెన్నై: పారాలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన అథ్లెట్ మరియప్పన్ తంగవేలుకు తమిళనాడులోని జయలలిత ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. తంగవేలును ప్రత్యేకంగా అభినందించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలిలిత.. ఆ అథ్లెట్కు రూ. 2 కోట్ల నజరానా ప్రకటించింది. మరోవైపు పారాలింపిక్స్లో సత్తాచాటిన మరియప్పన్, వరుణ్ సింగ్ భాటిలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ట్విట్టర్ పేజీలో అభినందనలు తెలియజేశారు.

ఇదిలా ఉండగా రియోకు వెళ్లేముందే అథ్లెట్లను ప్రొత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. పారాలింపిక్స్ లో స్వర్ణం సాధిస్తే రూ.75 లక్షలు, అలాగే రజతానికి రూ.50 లక్షలు, కాంస్య పతకానికి రూ.30 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రెజిల్లోని రియో డి జనీరోలు జరుగుతున్న పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో పాల్గొన్న మరియప్పన్ 1.89 మీటర్లు జంప్ చేసి స్వర్ణ పతకాన్ని సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement