పారాలింపియన్లకు సన్మానం | Paralympian to honor | Sakshi
Sakshi News home page

పారాలింపియన్లకు సన్మానం

Published Sun, Oct 16 2016 12:36 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

పారాలింపియన్లకు సన్మానం

పారాలింపియన్లకు సన్మానం

నగదు బహుమతులు అందజేసిన ‘సుమధుర’ గ్రూపు 


హైదరాబాద్: రియో పారాలింపిక్స్ పతక విజేతలను హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. బంగారు పతకాలు గెలిచిన దేవేంద్ర జజారియా (జావెలిన్ త్రో), మరియప్పన్ తంగవేలు (హైజంప్)తో పాటు కాంస్యం నెగ్గిన వరుణ్ సింగ్ భటి (హైజంప్)లను ‘సుమధుర’ అక్రొపొలిస్ గ్రూప్ ఘనంగా సన్మానించింది. శనివారం పార్క్ హయత్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా మంత్రి మహేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేయగా, గౌరవ అతిథిగా ఢిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాల్గొన్నారు.

మంత్రి మహేందర్, వేణుగోపాలాచారి చేతుల మీదుగా విజేతలకు రూ. 5 లక్షల చెక్‌ను అందజేశారు.   తంగవేలు కోచ్ సత్యనారాయణకు రూ. 4 లక్షలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో సుమధుర గ్రూపు చైర్మన్ జి.మధుసూదన్, వైస్ చైర్మన్ రామారావు, డెరైక్టర్ భరత్ తదితరులు పాల్గొన్నారు. వైకల్యాన్ని లెక్కజేయకుండా పతకాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచారంటూ అథ్లెట్లపై అతిథులు ప్రశంసల వర్షం కురిపించారు.

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement