
పనాజీ (గోవా): జాతీయ క్రీడల్లో తెలంగాణ స్విమ్మర్ వృత్తి అగర్వాల్ అద్భుత ప్రతిభ కనబరిచింది. ఈ క్రీడల్లో శుక్రవారం ఆమె ఐదో పతకాన్ని సొంతం చేసుకుంది. 400 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో వృత్తి (4ని:30.03 సెకన్లు) రజత పతకాన్ని దక్కించుకుంది. గుజరాత్‌లో జరిగిన గత జాతీయ క్రీడల్లో వృత్తి మూడు రజతాలు, ఒక కాంస్యంతో నాలుగు పతకాలు సాధించింది. ఈసారి ఆమె మూడు రజతాలు, రెండు కాంస్యాలతో ఐదు పతకాలను తన ఖాతాలో జమ చేసుకుంది.
ఫైనల్లో రష్మిక–శివాని జోడీ
జాతీయ క్రీడల మహిళల టెన్నిస్ ఈవెంట్ డబుల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన భమిడిపాటి శ్రీవల్లి రష్మిక–శ్రావ్య శివాని జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో రష్మిక –శివాని ద్వయం 6–4, 6–7 (5/7), 10–5తో షర్మదా బాలూ–సోహా సాదిక్ (కర్ణాటక) జంటను ఓడించింది. సింగిల్స్ విభాగంలో రష్మిక సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
Comments
Please login to add a commentAdd a comment