రియోలో భారత్కు స్వర్ణం, కాంస్యం
పారాలింపిక్స్‌లో భారత్ రెండు పతకాలు కైవసం చేసుకుంది. రియో పారాలింపిక్స్‌లో హైజంప్ విభాగంలో భారత అథ్లెట్లు స్వర్ణ, కాంస్య పతకాలు సాధించారు. పురుషుల హైజంప్ టీ-42 విభాగంలో మరియప్పన్ తంగవేలు 1.89 మీటర్లు హైజంప్ చేసి స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకోగా, మరో భారత అథ్లెట్ వరుణ్ సింగ్ భాటి 1.86 మీటర్లు జంప్ చేసి కాంస్య పతకం నెగ్గాడు. అమెరికాకు చెందిన సామ్ గ్రీవె రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకున్నాడు.
పారాలింపిక్స్లో హైజంప్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్ మరియప్పన్. కాగా, వ్యక్తిగత స్వర్ణం నెగ్గిన మూడో భారత అథ్లెట్ గా నిలిచాడు. గతంలో స్విమ్మింగ్, జావెలిన్ త్రో విభాగాలలో భారత్ వ్యక్తిగత స్వర్ణాలు కైవసం చేసుకుంది. పారాలింపిక్స్ లో ఓవరాల్ గా భారత్ పతకాల సంఖ్య 10కి చేరింది.