
రచయిత్రిగా సూపర్ స్టార్ డాటర్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్దకూతురు ఐశ్వర్యా ధనుష్ రచయిత్రిగా మారనున్నారు. రజనీ కూతురిగా, ధనుష్ లాంటి స్టార్ హీరోకు భార్యగా సమాజంలో ఎదుర్కొన్న అనుభవాలను పుస్తకంలో వివరించనున్నారు. ‘‘దీన్ని పుస్తకంగా రాయాలనుకోలేదు. అయిదేళ్ల క్రితం నుంచి డైరీ రాస్తున్నా. దాన్నే పుస్తకంగా తీసుకురావాలని ప్లాన్. నేను రచయితనవుతానని ధనుష్ అనుకోలేదు. నాన్నకైతే ఈ విషయం ముందే తెలుసు. ఎందుకంటే చిన్నతనం నుంచే నా ఆలోచనలన్నీ కవితలుగా రాసేదాన్ని. ఏదో రోజు రచయితనవుతానని నాన్న అంటూ ఉండేవారు’’ అని ఐశ్వర్య చెప్పారు.