
చెన్నై,పెరంబూరు: రజనీకాంత్ పెద్ద కూతురు, నటుడు ధనుష్ సతీమణి, సినీ దర్శకురాలు ఐశ్వర్యధనుష్ తాజాగా క్రీడా రంగంలోకి అడుగిడుతున్నారు. 2019వ ఏడాదికి గానూ ఈ నెల 25వ తేదీన డిల్లీలో జరగనున్న టేబుల్ టెన్నీస్ పోటీలకు చెన్నై జట్టు నిర్వాహకుల్లో ఒకరిగా ఐశ్వర్యధనుష్ భాగస్వామిగా మారారు. టేబుల్ టెన్నిస్ పోటీల్లో ఢిల్లీ, చెన్నై, పుణే, గోవా, కోల్‌కతా, ముంబై జట్లు పాల్గొననున్నాయి.