Ram Gopal Varma Sensational Comments On Actor Dhanusha And Aishwarya Divorce - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్‌ ట్వీట్లు..

Published Tue, Jan 18 2022 10:36 AM | Last Updated on Tue, Jan 18 2022 3:29 PM

Ram Gopal Varma Sensational Tweets Regarding Dhanush Aishwarya Divorce - Sakshi

Ram Gopal Varma Sensational Tweets Regarding Dhanush Aishwarya Divorce: సినీ ఇండస్ట్రీలో వివాహ బంధాలు ఇలా ముడిపడుతున్నాయి. అలా తెగిపోతున్నాయి. ఇంతకుముందు సెలబ్రిటీల పెళ్లిల్లు అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఆసక్తి ఉండేది. వారి వివాహనికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు. విందు భోజనంలోకి ఎన్ని వెరైటీలు వడ్డించారు. ఎంత ఖర్చు చేశారు అంటూ ఆరా తీసేవారు. ప్రస్తుతం సెలబ్రిటీలు విడిపోవడంపై కూడా అంతే ఆసక్తి కనబరుస్తున్నారు. కాకపోతే ఇక్కడ అందరినీ వేధించే ప్రశ్న ఒక్కటే. అదే 'ఎందుకు విడిపోయారు ? అసలు కారణం ఏంటీ ?' అని. ఇదంతా ఎందుకు చెబుతున్నామో అర్థమైందిగా. అవును.. కోలీవుడ్‌ బ్యూటీఫుల్‌ కపుల్‌ ధనుష్‌, ఐశ్వర్యలు వారి 18 ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి పలికారు. వారు ఎందుకు విడిపోయారు అని ప్రేక్షకలోకం ఓ వైపు ఉత్సుకతో, మరోవైపు జాలిగా స్పందిస్తోంది. 

ఇదీ చదవండి: ఇంటికి బొకే పంపి.. టచ్‌లో ఉండమని చెప్పింది.. ధనుష్‌-ఐశ్వర్యల లవ్‌స్టోరీ

అయితే వీరందరికి కాస్త భిన్నంగా సంచలన డైరెక్టర్ రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించాడు. అందరిలా రియాక్షన్‌ ఇస్తే అతను ఆర్జీవీ ఎందుకు అవుతాడు. ఎలాంటి సంఘటన జరిగిన విభిన్నమైన రీతిలో స్పందించడమే ఆర్జీవీ స్టైల్‌. తాజగా ధనుష్‌, ఐశ్వర్యలు విడిపోయినట్లు ప్రకటించేసరికి తనదైన శైలిలో ట్వీట్‌ చేశాడు ఆర్జీవీ. 'పెళ్లిల్లు ఎంత ప్రమాదకరమో హెచ్చరించడానికి తారల విడాకులే మంచి ట్రెండ్‌ సెట్టర్స్‌' అని ఆర్జీవీ ట్వీటాడు. అంతే కాకుండా 'సంతోషంగా ఉండటానికి రహస్యం ఏంటంటే.. పెళ్లి అనే జైలుకు వెళ్లడం కంటే వీలైనంతవరకూ ప్రేమించడం ఉత్తమం', 'స్మార్ట్‌ పీపుల్‌ లవ్‌ చేస్తారు. మూర్ఖులే పెళ్లి చేసుకుంటారు' అంటూ వరుస ట్వీట్లు చేశాడు రామ్‌ గోపాల్ వర్మ.
 




ఇదీ చదవండి: హీరో ధనుష్‌, ఐశ్వర్య విడాకులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement