వారిద్దరితో సినిమా తీసే ఆలోచన లేదు | No plans to direct Dhanush or father yet: Aishwarya Dhanush | Sakshi
Sakshi News home page

వారిద్దరితో సినిమా తీసే ఆలోచన లేదు

Published Thu, Apr 30 2015 11:55 AM | Last Updated on Tue, Oct 2 2018 3:27 PM

వారిద్దరితో సినిమా తీసే ఆలోచన లేదు - Sakshi

వారిద్దరితో సినిమా తీసే ఆలోచన లేదు

చెన్నై: తన తండ్రి రజనీకాంత్, భర్త ధనుష్ కలసి నటించే చిత్రానికి దర్శకత్వం వహించే ఆలోచన ప్రస్తుతానికి తనకు లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ తనయ సౌందర్య ధనుష్ వెల్లడించారు.  గురువారం చెన్నైలో సౌందర్య మాట్లాడుతూ.... మీ దర్శకత్వంలో రజనీకాంత్, ధనుష్ కలసి నటిస్తున్న చిత్రం ఎప్పడు ప్రారంభమవుతుందని ప్జజలు నిత్యం తనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని చెప్పారు.

అయితే అలాంటి ఆలోచనలు కానీ, ప్రణాళికలు కానీ ఏమీ ప్రస్తుతానికి తన వద్ద లేదని చెప్పారు. ధనుష్ నటించిన వాయి రాజా వాయి చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ చిత్రంలో ధనుష్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుదని సౌందర్య అన్నారు. వాయి రాజా వాయి చిత్రంలో గౌతమ్ కార్తీక్, ప్రియా ఆనంద్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు. వాయి రాజా వాయి చిత్రానికి సౌందర్య ధనుష్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement