హర్రర్‌ బాటలో ఐశ్వర్య ధనుష్‌ | Aishwarya Dhanush To Direct Horror Film | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 21 2018 10:53 AM | Last Updated on Tue, Aug 28 2018 7:24 PM

Aishwarya Dhanush To Direct Horror Film - Sakshi

ఐశ్వర్య ధనుష్‌

తమిళసినిమా: సక్సెస్‌ల వెంట పరుగులు తీయడం సర్వసాధారణం. అందుకు ట్రెండ్‌ను సెట్‌ చేయడానికి కృషి చేసేవారు కొందరైతే, సక్సెస్‌ ట్రెండ్‌ను అనుసరించే వారు మరికొందరు. మహిళా దర్శకురాలు ఐశ్వర్యధనుష్‌ ఇప్పుడు ట్రెండ్‌ను ఫాలో అవ్వడానికి సిద్ధం అవుతున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పెద్ద కూతురు, నటుడు ధనుష్‌ సతీమణి అయిన ఈమె తొలి ప్రయత్నంలోనే తన భర్త ధనుష్‌నే డైరెక్ట్‌ చేసిన క్రెడిట్‌ను సొంతం చేసుకున్నారు. 

3 పేరుతో రూపొందిన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, అందులోని వై దిస్‌ కొలవరి డి పాట ప్రపంచ స్థాయిలో దుమ్మురేపింది. ఆ చిత్ర సంగీతదర్శకుడు అనిరుద్‌ను సూపర్‌ రేంజ్‌కి తీసుకెళ్లింది. మలి ప్రయత్నంగా ఐశ్వర్యధనుష్‌ ‘వై రాజా వై’ చిత్రాన్ని తెరకెక్కించారు. అది కమర్శియల్‌గా ఓకే అనిపించుకుంది. అదే విధంగా స్టంట్‌ కళాకారుల జీవన విధానాన్ని ‘సినిమా వీరన్‌’ పేరుతో డాక్యుమెంటరీ చిత్రంగా రూపొందించారు.

ఇకపోతే  పారా ఒలింపిక్‌ క్రీడా పోటీల్లో బంగారు పతకాన్ని గెలుచుకున్న తమిళనాడుకు చెందిన మారియప్పన్‌ జీవిత చరిత్రను చిత్రంగా తెరపై ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. అయితే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఒక హర్రర్‌ కథా చిత్రాన్ని తెరకెక్కించడానికి ఐశ్వర్య ధనుష్‌ రెడీ అవుతున్నారని సమాచారం. దెయ్యం ఇతివృత్తంతో కూడిన ఈ చిత్రాన్ని తన భర్త ధనుష్‌ వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మించనున్నట్లు తెలిసింది. దీనికి వేల్‌రాజ్‌ ఛాయాగ్రహణం అందించనున్నారు. వనమగన్‌ జయశ్రీ కళాదర్శకత్వం వహించనున్నారు.  సాంకేతిక వర్గం కూడా పూర్తి అయిన తరువాత చిత్ర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement