
భగ్నప్రేమికుడి ఆత్మహత్య
ప్రేమికురాలికి వాట్సాప్ మెసేజ్
పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదని మనస్తాపం
చిన్నకోడూరు(సిద్దిపేట): ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఇబ్రహీంనగర్‌లో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పంతం లలిత, భూమయ్య దంపతుల చిన్నకుమారుడు రజనీకాంత్(30) కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యువతితో రజనీకాంత్‌కు వివాహం జరిపించాలని పెద్దల సమక్షంలో నిర్ణయమైంది.
ఆ యువతి వేరే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. కొద్ది నెలల క్రితం సదరు యువతి భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె పుట్టిల్లు అయిన ఇబ్రహీంనగర్‌లో ఉంటుంది. ఈ క్రమంలో యువతి, రజనీకాంత్ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. రజనీకాంత్‌కు కుటుంబ సభ్యులు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా నిరాకరిస్తున్నాడు. పైగా యువతితో పెళ్లికి అంగీకరించడం లేదు.
దీంతో మనస్తాపం చెందిన రజనీకాంత్ శుక్రవారం ఉదయం షాపునకు వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్లాడు. తాను చనిపోతున్నానని ఆ యువతికి రజనీకాంత్ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో అంతా వెతికారు. ఆచూకి లభ్యం కాలేదు. శనివారం రజనీకాంత్ సోదరుడు బావి వద్దకు వెళ్లగా చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment