love faileuer
-
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
మధిర : ప్రేమ విఫలమైందనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి.. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన బొగ్గుల శ్రీనివాస్‌రెడ్డి ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా ఆయన భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు. వీరు మధిరలోని సాయినగర్ లో నివాసం ఉంటున్నారు. శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు మణిరాగ్ రెడ్డి(29) హైదరాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తూ బోరబండ సమీపంలోని గాయత్రి నగర్లో ఉంటున్నాడు. కాగా, ప్రేమ విఫలమైందనే మనస్తాపంతో ఈనెల 12న రాత్రి 11 గంటల సమయంలో పాయిజన్ తాగాడు. అదే గదిలో ఉంటున్న మిత్రులు గమనించి యశోదా ఆస్పత్రికి తరలించి, శ్రీనివాసరెడ్డికి సమాచారం అందించారు. దీంతో ఆయన హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లగా మణిరాగ్‌రెడ్డి బతికే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆదివారం మధిరకు తీసుకొస్తుండగానే మణిరాగ్‌రెడ్డి తుదిశ్వాస విడిచాడు. మృతదేహానికి మధిర ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించాక బనిగండ్లపాడుకు తరలించారు. ఈ మేరకు తండ్రి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నేను చనిపోతున్నా..!
చిన్నకోడూరు(సిద్దిపేట): ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల పరిధిలోని ఇబ్రహీంనగర్‌లో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పంతం లలిత, భూమయ్య దంపతుల చిన్నకుమారుడు రజనీకాంత్(30) కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన యువతితో రజనీకాంత్‌కు వివాహం జరిపించాలని పెద్దల సమక్షంలో నిర్ణయమైంది. ఆ యువతి వేరే గ్రామానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. కొద్ది నెలల క్రితం సదరు యువతి భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె పుట్టిల్లు అయిన ఇబ్రహీంనగర్‌లో ఉంటుంది. ఈ క్రమంలో యువతి, రజనీకాంత్ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. రజనీకాంత్‌కు కుటుంబ సభ్యులు ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా నిరాకరిస్తున్నాడు. పైగా యువతితో పెళ్లికి అంగీకరించడం లేదు. దీంతో మనస్తాపం చెందిన రజనీకాంత్ శుక్రవారం ఉదయం షాపునకు వెళ్తున్నానని చెప్పి బయటికి వెళ్లాడు. తాను చనిపోతున్నానని ఆ యువతికి రజనీకాంత్ వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో అంతా వెతికారు. ఆచూకి లభ్యం కాలేదు. శనివారం రజనీకాంత్ సోదరుడు బావి వద్దకు వెళ్లగా చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ప్రేమ పేరుతో మోసం.. యువకుడి ఆత్మహత్య
కాజీపేట: ప్రేమ పేరుతో యువతి మోసం చేసిందనే మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ సమీపంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. కాజీపేట మండలం సోమిడికి చెందిన మంతుర్తి రమేశ్, రాజమ్మ దంపతుల కుమారుడు రాజ్‌కుమార్ (28) దాదాపు ఏడేళ్లుగా హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పనిచేసే చోట పరిచమైన ఓ యువతితో కొద్దికాలంగా చనువుగా ఉంటున్నాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన సదరు యువతి కుటుంబీకులకు ఇటీవల వీరి ప్రేమ విషయం తెలియడంతో రాజ్‌కుమార్‌ను హెచ్చరించారు. దీంతో రాజ్‌కుమార్ ఎదురు తిరగడంతో యువతి బంధువులు సూర్యాపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రేమించిన యువతి.. కుటుంబీకుల ఒత్తిడికి తలొగ్గి ఎదురు తిరుగడం, బంధువులు చంపేస్తామంటూ బెది రించడంతో రాజ్‌కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఏడేళ్లుగా సాగిన ప్రేమాయణం.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ సెల్ఫీ వీడియోను రికార్డు చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధు, మిత్రులకు పంపించాడు. వెంటనే అప్రమత్తమైన సన్నిహితులు రాజ్‌కుమార్‌ను వెతకడానికి ప్రయత్నించగా సూర్యాపేటలో చిక్కాడు. ఎంత నచ్చ చెప్పినా వినకుండా తనకు ఆత్మహత్యే శరణ్యమని చెప్పి పరారయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం నల్లగొండ సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం వెలుగు చూసింది. యువతి కుటుంబీకుల బెదిరింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, చెట్టంత ఎదిగిన కుమారుడు ప్రేమ కోసం బలయ్యాడని, తనను బెదిరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు కోరారు. -
ప్రియుడి వంచన తట్టుకోలేక..
యువతి ఆత్మహత్య సుందరగిరిలో ఘటన చిన్నముల్కనూర్‌లో బంధువుల ఆందోళన చిగురుమామిడి : ప్రియుడి వంచన భరించలేక ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు ప్రియుడే కారణమని మూడు పేజీల సూసైడ్ నోట్ రాసింది. దీంతో బంధువులు మృతదేహంతో ప్రియుడి ఇంటి ఎదుట ధర్నా చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన ఎనగందుల యశోద–రాయమల్లు దంపతుల కూతురు సుజాత(23) కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. ఈమెకు చిన్నముల్కనూర్‌కు చెందిన దొబ్బల మహేశ్‌తో ఐదేళ్లక్రితం పరిచయం ఏర్పడింది. మహేశ్‌కు ఇదివరకే పెళ్లయింది. ప్రస్తుతం అతడి భార్య గర్భిణి. ఈ విషయం దాచాడు. క్రమంగా వారి పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పెద్దలకు తెలిసింది. దీంతో మహేశ్ తాను సుజాతను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. సుజాతకు వచ్చే రూ.11వేల వేతనాన్ని మహేశ్ వాడుకున్నాడు. సుజాత డబ్బులతో ఓ ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సుజాత తనను పెళ్లి చేసుకోవాలని మహేశ్‌ను వారం రోజులుగా ఒత్తిడిచేస్తోంది. దీంతో మహేశ్ తనకు రూ.5లక్షల కట్నం, ఎకరం పొలం ఇస్తే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. పేదవారైన సుజాత తల్లిదండ్రులు తమకున్న 20గుంటల పొలం ఇస్తామని చెప్పారు. శుక్రవారం సుజాత తల్లి యశోద మహేశ్ ఇంటికి వెళ్లి తన బిడ్డను పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే మహేశ్, అతడి తండ్రి చంద్రయ్య ఆమెను దూషించి పంపించారు. విషయం తెలుసుకున్న సుజాత మనస్తాపం చెందింది. మహేశ్ ఇక తనను పెళ్లిచేసుకోడని భావించింది. ‘మమ్మి నన్ను క్షమించు. మహేశ్ అంటే నాకు చాలా ఇష్టం. అతడిని తప్ప మరెవరినీ పెళ్లి చేసుకోలేను. ఆయనే నా ప్రాణం.. ఐదు లక్షల కట్నం ఇవ్వమనడం బాధ కలిగించింది. ఇప్పుడు మహేశ్ తన మరదలుతో తిరుగుతున్నాడు. ఇది నాకు నచ్చలేదు. నా చావుకు మహేశ్ కారణం’ అని రాత్రి మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి గదిలో ఉరేసుకుంది. కుటుంబ సభ్యులు చూసేసరికి చనిపోయింది. మృతదేహంతో ఆందోళన సుజాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం చిన్నముల్కనూర్‌లోని మహేశ్ ఇంట్లో వేసి ఆందోళనకు దిగారు. అతడి తల్లి రాజమ్మను మహిళామండలి సభ్యులు చితకబాదారు. ఇంట్లోని సామగ్రి ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న హుస్నాబాద్ ఎస్సై కిరణ్ సంఘటన స్థలానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటుచేశారు. బంధువులు హుస్నాబాద్–కరీంనగర్ రహదారిపై గంటసేపు ధర్నా చేశారు. మహేశ్‌ను శిక్షించాలని డిమాండ్ చేశారు. పొద్దుపోయాక మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. అయితే ఈ సంఘటనపై ఇంకా కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. హత్యానేరం కింద శిక్ష అనుభవించిన మహేశ్.. మహేశ్ గతంలో ఒక హత్యానేరంలో శిక్ష అనేభవించాడు. 2011, జూన్ 26న చిన్నముల్కనూర్‌కు చెందిన బోనగిరి ఎల్లయ్య–కనుకమ్మ దంపతుల ఏకైక కుమారుడు అక్షయ్(11)ను హత్య చేశాడు. అక్షయ్ అక్కను పెళ్లి చేసుకున్న మహేశ్ ఆస్తి కోసం బండరాయితో కొట్టి చంపేశాడు. అక్షయ్ తల్లిదండ్రులకు ఉన్న ఎకరం భూమి కోసం ఈఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చాడు.