వెండితెరకు మరియప్పన్‌ జీవితం! | Mariyappan life to the silver screen! | Sakshi
Sakshi News home page

వెండితెరకు మరియప్పన్‌ జీవితం!

Published Sun, Jan 1 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

వెండితెరకు మరియప్పన్‌ జీవితం!

వెండితెరకు మరియప్పన్‌ జీవితం!

గతేడాది రియో పారా ఒలింపిక్స్‌లో హై జంప్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించినప్పుడు ‘ఎవరీ మరియప్పన్‌ తంగవేలు’ అని దేశమంతా ఆరా తీసింది. అతడికి జేజేలు కొట్టింది. ఇప్పుడీ తమిళనాడు యువకుడి జీవితకథ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పెద్ద కుమార్తె ఐశ్వర్యా ధనుష్‌ను ఆకర్షించింది. ‘మరియప్పన్‌’ పేరుతో స్వీయ దర్శకత్వంలో సినిమా నిర్మిస్తున్నారామె. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను ఆదివారం షారుఖ్‌ఖాన్‌ ట్విట్టర్‌లో విడుదల చేశారు. హిందీలో  ‘మేరీ కోమ్‌’, ‘సుల్తాన్‌’, ‘ఎం.ఎస్‌. ధోని’, ‘దంగల్‌’... క్రీడాకారుల జీవితకథలతో రూపొందిన చిత్రాలకు ప్రేక్షకాదరణ బాగుంది. అయితే... ఓ పారా ఒలింపియన్‌ జీవితకథతో  రూపొందనున్న మొదటి చిత్రం ఇదే అవుతుందేమో! ఇంగ్లీష్, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement