Mariyappan tangavelu
-
మారియప్పన్‌కు సర్కారీ ఉద్యోగం: సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: పారా ఒలింపిక్స్ పతక విజేత మారియప్పన్ తంగవేల్‌కు ప్రభుత్వ ఉద్యోగం దక్కింది. ఈ మేరకు నియామక పత్రాన్ని సీఎం ఎంకే స్టాలిన్ బుధవారం అందజేశారు. సేలం జిల్లా పెరియవడకం పట్టి గ్రామానికి చెందిన మారియప్పన్ తంగవేలు రియో పారా ఒలింపిక్స్ హైజంప్ విభాగంలో బంగారు పతకం దక్కించుకుని తమిళనాట హీరోగా అవతరించిన విషయం తెలిసిందే. ఇటీవల టోక్యో పారా ఒలింపిక్స్‌లోనూ బంగారం ప్రయత్నం చేసి రజతం దక్కించుకున్నారు. పారా ఒలింపిక్స్‌లో రెండు సార్లు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అనేక పతకాలు దక్కించుకున్నా ప్రభుత్వ ఉద్యోగం దక్కలేదని నెల క్రితం మారియప్పన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సీఎం స్టాలిన్ స్పందించారు. కరూర్‌లోని కాగితం పరిశ్రమ విక్రయ విభాగం అసిస్టెంట్ మేనేజర్‌గా నియమించారు. ఇందుకు తగ్గ నియామక ఉత్తర్వులను బుధవారం సచివాలయంలో మారియప్పన్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ కనిమొళి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారియప్పన్ మీడియాతో మాట్లాడు తూ.. తనకు ఉద్యోగం లభించడం సంతోషంగా ఉందన్నారు. తమిళనాడులో పారా క్రీడా అసోసియేషన్‌కు గుర్తింపు కల్పించాలని, తద్వారా తన లాంటి వారు ఎందరో రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. చదవండి: (వినీషా పవర్ ఫుల్ స్పీచ్ : మీ తీరు చూస్తోంటే.. కోపం వస్తోంది!) ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు రూ. 196 కోట్లు కరోనా సమయంలో సేవలందించిన వైద్యఆరోగ్య సిబ్బందికి ప్రోత్సాహకంగా రూ. 196 కోట్లను ప్రభు త్వం ప్రకటించింది. 24 వేల మంది వైద్య సిబ్బంది, 26 వేల మంది నర్సులు, 6 వేల మంది హెల్త్ అసిస్టెంట్స్, 8 వేల మంది గ్రామ ఆరోగ్య సిబ్బంది సహా మొత్తం 1.05 లక్షల మందికి ప్రోత్సాహకం ప్రకటించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో 11 మందికి సీఎం స్టాలిన్ ప్రోత్సాహక నగ దు అందజేశారు. అలాగే రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నేతృత్వంలో రూ. 170 కోట్లతో 121 పాఠశాలల్లో నిర్మించిన అదనపు తరగతులు, గ్రంథాలయాలు, పరిశోధక విభాగాల భవనాలను సీఎం ప్రారంభించారు. మంత్రులు ఎం.సుబ్రమణియన్, అన్బిల్ మ హేశ్, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ పాల్గొన్నారు. -
Paralympics 2021: భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు..
టోక్యో: టోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. పురుషుల అథ్లెటిక్స్ హైజంప్ T-63 విభాగంలో మరియప్పన్ తంగవేల్ భారత్‌కు రజత పతకం సాధించగా,శరధ్ కూమార్ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. దీంతో భారత్ ఖాతాలోకి మొత్తం 10 పతకాలు చేరాయి. మరియప్పన్ తంగవేల్, శరధ్ కూమార్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. 2016 రియో పారాలింపిక్స్‌లో మరియప్పన్ గోల్డ్ మెడల్ సాధించాడు. అంతకు ముందు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్1 కేటగిరీలో సింగ్‌రాజ్ అధానా కాంస్య పతకం సాధించాడు. పారా ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు, 5 రజతాలు, మూడు కాంస్య పతకాలతో భారత్ 30వ స్థానంలో ఉంది. చదవండి: Dale Steyn: అన్ని క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన స్టార్ బౌలర్ Soaring higher and higher! Mariyappan Thangavelu is synonymous with consistence and excellence. Congratulations to him for winning the Silver Medal. India is proud of his feat. @189thangavelu #Paralympics #Praise4Para pic.twitter.com/GGhtAgM7vU — Narendra Modi (@narendramodi) August 31, 2021 The indomitable @sharad_kumar01 has brought smiles on the faces of every Indian by winning the Bronze Medal. His life journey will motivate many. Congratulations to him. #Paralympics #Praise4Para pic.twitter.com/uhYCIOoohy — Narendra Modi (@narendramodi) August 31, 2021 -
ఖేల్ రత్నకు రోహిత్ శర్మ నామినేట్
ఢిల్లీ : క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న అవార్డుకు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పేరును క్రీడా మంత్రిత్వశాఖ కేంద్రానికి సిఫార్సు చేసింది. అతనితో పాటు రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ సంచలనం మనిక బాత్రా, రియో పారా ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు పేర్లను ప్రతిష్టాత్మక పురస్కారానికి సిఫార్సు చేశారు. క్రీడాశాఖ ఆధ్వర్యంలో మొత్తం 12 మంది సెలక్షన్ కమిటీ సభ్యులు ప్రతిష్టాత్మక అవార్డుకు వీరిని నామినేట్ చేసినట్లు మంగళవారం పేర్కొంది. అత్యున్నత క్రీడా అవార్డుకు నలుగురు క్రీడాకారులు నామినేట్ కావడం ఇది రెండవసారి. 2016లో కూడా నలుగురు క్రీడాకారుల్ని ఈ అవార్డు కోసం నామినేట్ చేశారు. (చదవండి : ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్ డ్రీమ్ 11 2019 ఏడాదిలో రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. ఆ సీజన్లో రోహిత్ వన్డేల్లో ఏడు సెంచరీలతో మొత్తం 1490 రన్స్ చేశాడు. కాగా 2019 ఏడాది క్రికెట్లో అత్యున్నత ప్రదర్శనకు గానూ రోహిత్ శర్మను ప్రతిష్టాతక్మ అవార్డుకు సిఫార్సు చేసినట్లు కమిటీలో సభ్యుడైన మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్, ఎషియన్ గేమ్స్‌లో బంగారు పతకాలు, 2019 ఏసియన్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో క్యాంస్య పతకం సాధించి వినేశ్ ఫోగట్ చరిత్ర సృష్టించారు. మరియప్పన్ తంగవేలు.. 2016లో రియో పారాఒలింపిక్స్‌లో టి42 హై జంప్ కేటగిరి విభాగంలో బంగారు పతకం సాధించి దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పాడు. టేబుల్ టెన్నిస్ సంచలనంగా పేరు పొందిన మనిక బాత్రా 2018 నుంచి అత్యద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం, ఏసియన్ గేమ్స్‌లో క్యాంస్య పతకం సాధించి తన సత్తాను చాటింది.(కోహ్లి.. అప్పుడే 12 ఏళ్లయిందా!) కాగా ఇండియన్ క్రికెట్లో రోహిత్ శర్మ కంటే ముందు ముగ్గురు మాత్రమే రాజీవ్‌గాంధీ ఖేల్ రత్న పురస్కారానికి ఎంపికయ్యారు. వారిలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(1998), టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని(2007), ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(2018)లో ఎంపికయ్యారు. -
వెండితెరకు మరియప్పన్ జీవితం!
గతేడాది రియో పారా ఒలింపిక్స్‌లో హై జంప్‌లో గోల్డ్ మెడల్ సాధించినప్పుడు ‘ఎవరీ మరియప్పన్ తంగవేలు’ అని దేశమంతా ఆరా తీసింది. అతడికి జేజేలు కొట్టింది. ఇప్పుడీ తమిళనాడు యువకుడి జీవితకథ సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యా ధనుష్‌ను ఆకర్షించింది. ‘మరియప్పన్’ పేరుతో స్వీయ దర్శకత్వంలో సినిమా నిర్మిస్తున్నారామె. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆదివారం షారుఖ్‌ఖాన్ ట్విట్టర్లో విడుదల చేశారు. హిందీలో ‘మేరీ కోమ్’, ‘సుల్తాన్’, ‘ఎం.ఎస్. ధోని’, ‘దంగల్’... క్రీడాకారుల జీవితకథలతో రూపొందిన చిత్రాలకు ప్రేక్షకాదరణ బాగుంది. అయితే... ఓ పారా ఒలింపియన్ జీవితకథతో రూపొందనున్న మొదటి చిత్రం ఇదే అవుతుందేమో! ఇంగ్లీష్, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
బంగారాలకు బ్రహ్మరథం
► తంగమారికి ’కారు’ కానుక ► వేళమ్మాల్‌లో ‘రియో’ హీరోల సందడి ► దీపిక, దేవేంద్ర, వరుణ్‌లకు సత్కారం ► తలా..రూ.ఐదు లక్షల విలువైన బంగారు నాణేలు ► విద్యార్థులతో ముచ్చట్లు రియో పారాలింపిక్ బంగారాలు గురువారం చెన్నైలో ప్రత్యక్షమయ్యారు.క్రీడారంగంలో దేశానికి వన్నె తెచ్చిన ఈ హీరోలకు వేళమ్మాల్ విద్యార్థులు బ్రహ్మరథం పట్టారు. తమిళ తంగం మారియప్పన్‌కు కారును బహుకరించారు. మరో బంగారం దేవేంద్ర జజారియా, వెండి సింగారం దీపామాలిక్, కాంస్య కెరటం వరుణ్ సింగ్ బాటీలకు తలా రూ. ఐదు లక్షల విలువైన బంగారు నాణేలను అందజేశారు. విద్యార్థులతో ముచ్చటించిన పారా పతకాల ధీరులు తమ క్రీడానుభవాలను పంచుకున్నారు. - సాక్షి, చెన్నై సాక్షి, చెన్నై: చెన్నైలోని వేళమ్మాల్ విద్యాసంస్థ యాజమాన్యం క్రీడాకారుల్ని ప్రోత్సహించే విధంగా ముందుకు సాగుతున్నదని చెప్పవచ్చు. భారతదేశంలో ఏ క్రీడాకారుడైనా సరే ఉత్తమ ప్రతిభను కనబరిస్తే చాలు సత్కరిస్తూ, తమ వంతుగా ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తున్నది. ఆ దిశలో తమిళ తంగం మారియప్పన్ తంగవేలు పారాలింపిక్స్‌లో బంగారం చేజిక్కించుకోవడంతో తమ విద్యాసంస్థకు ఆహ్వానించి గతవారం ఘనంగా సత్కరించారు. ఇక, ఇదే ఒలింపిక్స్‌లో బంగారం, వెండి, కాంస్య పతకాలతో దేశానికి గర్వకారణంగా నిలిచిన మరో ముగ్గుర్ని కూడా సత్కరించుకునేందుకు ఆ యాజమాన్యం నిర్ణయించింది.ఇందుకుగాను గురువారం మధురవాయిల్ సమీపంలోని ఆలపాక్కం క్యాంపస్ ఆవరణ వేదికగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైజంప్‌లో బంగారంతో మెరిసిన మారియప్పన్ తంగవేలు, ఎఫ్-46 జావెలిన్ త్రోలో తన రికార్డును తానే బద్దలు చేస్తూ, కొత్త చరిత్ర సృష్టించిన దేవేంద్ర జజరియా, షాట్‌పుట్‌లో వెండి సింగారంతో తొలి భారతీయ మహిళగా ఘనత సాధించిన దీపామాలిక్, హైజంప్‌లో కాంస్యంతో సత్తా చాటిన వరుణ్ సింగ్ బాటి ఉదయాన్నే ఆలపాక్కంకు చేరుకోగానే, వేళమ్మాల్ విద్యార్థులు బ్రహ్మరథం పట్టారు. మేళ తాళాల నడుమ, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను చాటే విధంగా ఆహ్వానం పలికారు. జాతీయ పతాకాన్ని చేత బట్టి పారా రియో హీరోలను ఆహ్వానిస్తూ, తమ విద్యా సంస్థల్లోకి తీసుకెళ్లారు. అక్కడి వేదికపై జరిగిన వేడుకలో పూలమాలలతో, పూల కిరీటాలతో ఘనంగా సత్కరించారు. క్రీడాస్ఫూర్తిని చాటే పాటలతో ఈ సందర్భంగా విద్యార్థులు క్రీడాకారులను అభినందనలో ముంచెత్తారు. తంగంకు కారు : రియోలో తంగంతో మెరిసిన రాష్ట్రానికి చెందిన మారియప్పన్ తంగవేలుకు ఆ విద్యా సంస్థ యాజమాన్యం రూ. ఆరు లక్షలు విలువగల రెనాల్ట్ కై ్వడ్ కారును బహూకరించింది. దేశ గౌరవాన్ని పెంచడంలోనే కాదు, తమిళ ఖ్యాతిని రియోలో చాటిన తంగంను ఈ సందర్భంగా విద్యార్థులు అభినందనలతో ముంచెత్తారు. ఆ విద్యా సంస్థ చైర్మన్ వేల్ మురుగన్ కారు తాళంను మారియప్పన్‌కు అందజేశారు. అలాగే, మిగిలిన ముగ్గురు హీరోలను బంగారాలతో సత్కరించారు. ఒకొక్కరికి రూ. ఐదు లక్షలు విలువల బంగారు నాణేలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా క్రీడ కారుల రియో విజయకేతనాన్ని వివరిస్తూ ప్రత్యేకంగా వీడియో ప్రజంటేషన్ను ప్రదర్శించడం విశేషం. ఈ సమయంలో ఇక్కడి విద్యార్థుల కేరింతలకు హద్దే లేదు. క్రీడాకారులకు విద్యార్థులు, విద్యార్థులకు క్రీడాకారులు దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే, విద్యార్థులతో రియో హీరోలు ముచ్చటించారు. వారి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ప్రతి రోజూ ఓ పండుగే: దీపామాలిక్ విద్యార్థులతో ముచ్చటిస్తూ, వేళమ్మాల్‌లో తమను సత్కరించుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. ప్రోత్సాహం అన్నది ఉంటే చాలు, భవిష్యత్తులో ఎంతో ఎత్తుకు ఎదగగలమని, మరిన్ని పతకాలను సాధించగలమన్నారు. ఈ వయస్సులో కూడా తాను ప్రతిభను చాటుకోవడంతో పతకం దక్కిందని, ఇది తనకు ఎంతో ఆనందంగా, గర్వకారణంగా ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిరోజూ పండుగే అని, ఆనందోత్సాహలతో ప్రతిరోజును పరిగణించాలని ఓ విద్యార్థి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. క్రమశిక్షణ, కృషి , పట్టుదల ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగలమన్న భావనతో ప్రతి విద్యార్థి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సచిన్ టెండూల్కర్ వంటి గొప్ప క్రీడాకారుడు అడుగు పెట్టిన, సత్కారం అందుకున్న వేళమ్మాల్ విద్యాసంస్థ వేదికలో, తాను కూడా సత్కారం పొందడం జీవితంలో లభించిన అదృష్టంగా భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే, వైకల్యం అడ్డు కాదు అని, కృషి, పట్టుదల, సాధన ఉంటే చాలు అంటూ, ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఉదాహరణగా రియోలో పతకాలు సాధించిన తమ నలుగుర్ని ఉద్దేశించి సమాధానం ఇచ్చారు. మారియప్పన్ మాట్లాడుతూ తన తల్లి, సోదరుడు, సోదరి ప్రోత్సాహం, తన స్వగ్రామంలోని ప్రతి ఒక్కరూ అందించిన సహకారం, పాఠశాల, కళాశాల స్థాయిలో లభించిన ఆదరణతో పాటు కోచ్ ఇచ్చిన సాధనతో తాను ఈ పతకాన్ని సాధించినట్టు వివరించాడు. దేవేంద్ర మాట్లాడుతూ తనకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. దివ్యాంగుడు అన్న భావనను వీడాలని, ఎంతటి విజయాన్ని అయినా సాధించగలమన్న ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. వరుణ్‌సింగ్ బాటీ మాట్లాడుతూ ఏదైనా సాధించ గలనన్న దృక్పథంతో శ్రమించానని, అందుకు ఫలితం గా పతకం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం 80 చ.అడుగులతో ఆ విద్యా సంస్థ విద్యార్థులు రియో పారాలింపిక్లోని క్రీడల్ని ఎత్తి చూపుతూ సిద్ధం చేసిన పెరుయింటింగ్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ విద్యా సంస్థ ప్రిన్సపాల్ జయంతి రాజగోపాలన్, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.