వరుణ్‌తేజ్ కొత్త మూవీ అప్‌డేట్‌...అంచనాలు పెంచేసిన ఫస్ట్‌లుక్‌ | Gandeevadhari Arjuna: Varun Tej,Praveen Sattaru Film First Look Out | Sakshi
Sakshi News home page

Gandeevadhari Arjuna: వరుణ్‌తేజ్ కొత్త మూవీ అప్‌డేట్‌...అంచనాలు పెంచేసిన ఫస్ట్‌లుక్‌

Published Thu, Jan 19 2023 4:00 PM | Last Updated on Thu, Jan 19 2023 4:00 PM

Gandeevadhari Arjuna: Varun Tej,Praveen Sattaru Film First Look Out - Sakshi

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు సమర్పణలో ఎస్‌వీసీసీ పతాకంపై బాపినీడు, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమై చాలా రోజులు అయినప్పటికీ ఇంతవరకు ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వలేదు. తాజాగా వరుణ్‌ తేజ్‌ పుట్టిన రోజు (జనవరి 19) సందర్భంగా గురువారం సినిమా టైటిల్‌తో పాటు వరుణ్‌ తేజ్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది. 

ఈ సినిమాకు ‘గాండీవధారి అర్జున’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. లండన్‌ బ్రిడ్జ్‌పై యాక్షన్‌ సన్నివేశానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఇందులో వరుణ్‌ తేజ్‌ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ గూడచారి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement