
అల్లు అరవింద్, తమన్నా, ప్రదీప్, ప్రవీణ్ సత్తారు
‘‘అల్లు అరవింద్‌గారి సినిమాల వల్ల నేను యాక్టర్ నుండి స్టార్ అయ్యాను. ఇప్పుడు చేస్తున్న ‘లెవెన్త్ అవర్’ సిరీస్ వల్ల ఓ స్టార్ నుండి మంచి నటిగా పేరు తెచ్చుకుంటానని భావిస్తున్నాను. ఓ నటిగా తెలుగు సినిమాలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. తెలుగు కంటెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది’’ అన్నారు హీరోయిన్ తమన్నా. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తమన్నా ప్రధాన పాత్రలో ‘లెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది. త్వరలో ‘ఆహా’లో ప్రసారం కానున్న ఈ సిరీస్ టైటిల్, పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘కొన్ని గంటల్లో నడిచే కథ ‘లెవెన్త్ అవర్’. ప్రవీణ్ సత్తారు కథ నచ్చితేనే చేస్తాడు. ఈ సబ్జెక్ట్ బావుందని అన్నారు. ప్రదీప్‌గారు నిర్మాతే కాదు.. అద్భుతమైన రైటర్ కూడా. అందుకనే మా కోసం ఆయన్ని మరో వెబ్ సిరీస్ చేయమని అడిగాను’’ అన్నారు. ‘‘8 అవర్స్’ అనే బుక్ నుండి హక్కులు కొని ‘లెవెన్త్ అవర్’ కథ తయారు చేశాను’’ అన్నారు రచయిత, నిర్మాత ప్రదీప్. ‘‘ఓ సిరీస్‌కు కావాల్సిన అన్ని అంశాలు మా ‘లెవన్త్ అవర్’లో ఉన్నాయి. ఒక రాత్రిలో జరిగే కథ’’ అన్నారు ప్రవీణ్ సత్తారు.
Comments
Please login to add a commentAdd a comment