స్నేహితులే శత్రువులుగా.. | Tamannaah In web Series 11th Hour | Sakshi
Sakshi News home page

స్నేహితులే శత్రువులుగా..

Published Thu, Mar 25 2021 12:40 AM | Last Updated on Thu, Mar 25 2021 4:36 AM

Tamannaah In web Series 11th Hour - Sakshi

తమన్నా 

హీరోయిన్‌ తమన్నా నటించిన వెబ్‌ సిరీస్‌ ‘లెవన్త్‌ అవర్‌’. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించారు. ప్రదీప్‌ ఉప్పలపాటి ఈ సిరీస్‌కు రైటర్‌గా వ్యవహరించడంతో పాటు నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ఉగాది సందర్భంగా ‘ఆహా’లో ఏప్రిల్‌ 9 నుంచి ప్రసారం కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘మల్టీ బిలియన్‌ డాలర్స్‌ కంపెనీ ఆదిత్య గ్రూప్‌కి అరత్రికా రెడ్డి సీఈఓ. ఈ కంపెనీ అనుకోకుండా ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకుంటుంది. ఆమె స్నేహితులే శత్రువులుగా మారతారు.

ఎగ్జయిట్‌మెంట్‌తో కూడిన ఈ ఈ గందరగోళం నుంచి బయటపడటానికి అరత్రిక ఎలా పోరాడింది? అనే ఆసక్తికరమైన అంశాలతో ‘లెవన్త్‌ అవర్‌’  రూపొందింది. ఉపేంద్ర నంబూరి రచించిన ‘8 అవర్స్‌’ పుస్తకం స్ఫూర్తితో ఈ వెబ్‌ సిరీస్‌ను రూపొందించాం. డ్రామా, థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ మేళవింపుగా 8 ఎపిసోడ్స్‌తో రూపొందింది’’ అన్నారు. ‘‘పురుషాధిక్య ప్రపంచంలో తనదైన గుర్తింపు సంపాదించుకోవడానికి అరత్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసింది? అనేది ఇందులో ప్రధానాంశం’’ అన్నారు తమన్నా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement