తమన్నా‘లెవన్త్‌ అవర్’ టీజర్‌ వచ్చేసింది | Tamannaah 11th Hour web Series Teaser Out | Sakshi
Sakshi News home page

తమన్నా‘లెవన్త్‌ అవర్’ టీజర్‌ వచ్చేసింది

Published Tue, Mar 30 2021 8:31 AM | Last Updated on Tue, Mar 30 2021 9:23 AM

Tamannaah 11th Hour web Series Teaser Out - Sakshi

‘చక్రవ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు... క్రియేట్‌ చేయాల్సి ఉంటుంది’ అని ‘లెవన్త్‌ అవర్‌’ టీజర్‌లో అంటున్నారు తమన్నా. ఆర్థిక సమస్యల వలయంలో చిక్కుకున్న ఓ మల్టీ బిలియన్‌  డాలర్స్‌ కంపెనీని శత్రువుల నుంచి కాపాడేందుకు తమన్నా ఎలాంటి స్టెప్‌ తీసుకున్నారు అనేది ‘లెవన్త్‌ అవర్‌’ వెబ్‌ సిరీస్‌లో చూడాలి.

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఈ సిరీస్‌ తెరకెక్కింది. ఇందులో తమన్నా, అరుణ్‌ అదిత్, వంశీ కృష్ణన్, రోషిణి, అభిజిత్, శత్రు ప్రధాన పాత్రలు చేశారు. అరత్రికా రెడ్డి పాత్ర చేశారు తమన్నా. తాజాగా ఈ సిరీస్‌ టీజర్‌ విడులైంది. ప్రదీప్‌ ఉప్పలపాటి నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఏప్రిల్‌ 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement