మరో వెబ్‌సిరీస్‌కు తమన్నా గ్రీన్‌ సిగ్నల్‌ | Heroine Tamannaah Signs Her Third Web Series | Sakshi
Sakshi News home page

ముచ్చటగా మూడో వెబ్‌సిరీస్‌కు సైన్‌ చేసిన తమన్నా

Published Thu, Jun 24 2021 9:24 PM | Last Updated on Thu, Jun 24 2021 10:20 PM

Heroine Tamannaah Signs Her Third Web Series - Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో ఫుల్‌ బిజీగా ఉంది. ఇప్పటికే ఆమె ‘లెవన్త్ అవర్’, ‘నవంబర్ స్టోరీ’ వెబ్‌సీరీస్‌లలో నటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు వెబ్‌సిరీస్‌లలోనూ తమన్నా నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా ఆమెకు మరో వెబ్‌సిరీస్‌ ఆఫర్‌ వచ్చిందట. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు తమన్నా సైన్‌ చేసినట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ఈ సిరీస్‌కు సంబంధించిన షూటిం్‌ మొదలు కానుందని తెలుస్తోంది. అరుణిమా శర్మ తెరకెక్కించనున్న ఈ వెబ్‌సిరీస్‌లో తమన్నా నెగిటివ్‌ రోల్‌లో కనిపించనుందని సమాచారం.

ఈ వెబ్‌సిరీస్‌ కోసం అమెజాన్ ప్రైమ్ చిత్ర నిర్మాలతో భారీ డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. 2022లో ఈ వెబ్‌సిరీస్‌ రిలీజ్‌ కానుంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎఫ్ 3లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు నితిన్ హీరోగా చేస్తున్న మ్యాస్ట్రో చిత్రంలో కీలకపాత్ర పోషించింది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. 

చదవండి : ముఖంపై మొటిమలు రాకుండా ఉమ్మి వాడుతా: తమన్నా
ప్రముఖ నటి నివేదా పేతురాజ్‌కు చేదు అనుభవం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement