టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆఫీసర్, మన్మథుడు2 చిత్రాలతో ఘోర అపజయాలను మూటగట్టుకున్నారు. అంతకుముందు ‘దేవదాస్’ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. ఇలా వరుసగా అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడటంతో ఆయన కాస్త వెనకపడ్డారు. దీంతో సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వైల్డ్ డాగ్’ అనే చిత్రంలో నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ కొత్తగా ఉండటంతో ఈ సినిమాపై అందరిలోనూ అంచనాలు మొదలయ్యాయి. ప్రసుతం లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదాపడింది. (అక్కినేని ‘మనం’.. ఎన్నేళ్లైనా మరువం)
అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో తన తదుపరి చిత్రాల కోసం కథలను అన్వేషించే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు రచయితలు, దర్శకులు నాగార్జునను కలిసి కథలు వినిపించారు. అయితే చాలా కాలం తర్వాత రాజశేఖర్‌కు ‘గరుడవేగ’తో కమర్షియల్ హిట్ అందించిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ చెప్పిన కథకు నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నాగార్జున ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని పక్కా పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌ను దర్శకుడు రెడి చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ చిత్రానికి ‘నా రాత నేనే రాసుకుంటా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. (నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా పాజిటివ్!)
గరుడవేగతో రాజశేఖర్‌కు హిట్ అందించిన ప్రవీణ్ మరి నాగార్జునకు కూడా అదే రేంజ్‌లో హిట్ అందించి మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొస్తాడో లేదో వేచి చూడాలి. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ‘వైల్డ్ డాగ్’ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చిత్రాన్ని నాగార్జున చేస్తారని వార్తల వచ్చాయి. దీంతో ‘వైల్డ్ డాగ్’ తర్వాత బంగర్రాజు చిత్రాన్ని చేస్తారా? లేక ప్రవీణ్ సత్తారు సినిమాను తెరకెక్కిస్తారనే దానిపై స్పష్టత రావాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment