బాబోయ్‌... ఫుల్‌ పేజీ డైలాగ్‌ | Shraddha Das in Rajasekhar and Praveen Sattaru Film | Sakshi
Sakshi News home page

బాబోయ్‌... ఫుల్‌ పేజీ డైలాగ్‌

Published Sat, Jun 3 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM

బాబోయ్‌... ఫుల్‌ పేజీ డైలాగ్‌

బాబోయ్‌... ఫుల్‌ పేజీ డైలాగ్‌

ఏం చేయాల్రా బాబు... అసలే తెలుగు సరిగా రాదు!! దీనికి తోడు ఫుల్‌ పేజీ తెలుగు డైలాగు చేతిలో పెట్టి, త్వరగా టేక్‌కి రెడీ అవ్వమని చెబుతున్నారంటూ నోరెళ్లబెట్టారు శ్రద్ధా దాస్‌. ఈ మేడమ్‌గారు బెంగాలీ. ఆల్మోస్ట్‌ పదేళ్ల నుంచి తెలుగు సినిమాలు చేస్తుండడంతో తెలుగు కొంచెం కొంచెం నేర్చుకున్నారు. కానీ, ఫుల్‌ పేజీ డైలాగులు చెప్పేసేంత తెలుగు రాదు. పైగా, అందులో కొన్ని నోరు తిరగని డైలాగులు ఉన్నాయట. దాంతో కొంచెం కష్టపడి ప్రాక్టీస్‌ చేసి, టేక్‌ ఫినిష్‌ చేశారట!

రాజశేఖర్‌ హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఎం. కోటేశ్వర్‌రాజు నిర్మిస్తున్న సినిమా ‘పీఎస్వీ గరుడవేగ 126.18 ఎమ్‌’. ఇందులో శ్రద్ధాదాస్‌ జర్నలిస్ట్‌ కమ్‌ న్యూస్‌ రీడర్‌ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆమెపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ నోట్‌ చేసుకోవలసిన పాయింట్‌ ఏంటంటే... రియల్‌ లైఫ్‌లో కూడా శ్రద్ధాదాస్‌ జర్నలిస్టే. హీరోయిన్‌ కాకముందు జర్నలిజమ్‌లో డిగ్రీ కంప్లీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement