Nagarjuna- Praveen Sattaru Movie Starts Second Schedule Shoot - Sakshi
Sakshi News home page

Nagarjuna: మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి కింగ్‌ నాగార్జున!

Aug 3 2021 7:47 AM | Updated on Aug 3 2021 11:56 AM

Nagarjuna To Start Praveen Sattaru Movie Second Schedule - Sakshi

Nagarjuna- Praveen Sattaru Movie: వైల్డ్‌ డాగ్‌ సినిమాలో పూర్తి స్థాయి యాక్షన్‌ క్యారెక్టర్‌ చేసిన నాగార్జున మళ్లీ యాక్షన్‌ మోడ్‌లోకి వెళ్లారు. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో నాగ్‌ ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ గోవాలో పూర్తైంది. రెండో షెడ్యూల్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఆరంభించనున్నారు.

"హైరేంజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఇందులో నాగార్జున ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ ప్యాక్‌ రోల్‌లో కనిపించనున్నారు. ఇండియాలోని ప్రధాన నగరాలు, విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశాం" అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌, నారాయణ్‌దాస్‌ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహనరావు, శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement