యాక్షన్‌ అర్జున్‌ | Varun Tej Gandeevadhari Arjuna gets wrapped | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ అర్జున్‌

Published Thu, Jun 29 2023 4:15 AM | Last Updated on Thu, Jun 29 2023 4:15 AM

Varun Tej Gandeevadhari Arjuna gets wrapped - Sakshi

సెక్యూరిటీ ఆఫీసర్‌గా వరుణ్‌ తేజ్‌ నటించిన యాక్షన్‌ చిత్రం ‘గాంఢీవధారి అర్జున’. వరుణ్‌ తేజ్‌ హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇది. సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటించారు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 25న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది.

ఈ సందర్భంగా ఈ సినిమాలోని వరుణ్‌ తేజ్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో అర్జున్‌పాత్రలో వరుణ్‌ తేజ్‌ కనిపించనున్నట్లు   తెలుస్తోంది. ‘‘ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఫుల్‌ యాక్షన్‌ మోడ్‌లో కనిపిస్తారు. అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల నుంచి ప్రజలను అతను ఏ విధంగా కాపాడాడు? అందుకు అతని వ్యూహాలేంటి? అనేది ఈ సినిమాలో ఆసక్తికరం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement