వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. ఓ మోస్తరు అంచనాల మధ్య శుక్రవారం(ఆగస్ట్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. కథ, కథనంలో కొత్తదనం లేదని, దర్శకుడు మేకింగ్‌పై పెట్టిన దృష్టి బలమైన కథను రాయడంలో పెట్టలేదని విమర్శలు వచ్చాయి. పలు వెబ్‌సైట్లు కూడా ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలే ఇచ్చాయి. దీంతో తొలి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడంలో ఈ చిత్రం విఫలమైంది.
(చదవండి: సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి.. కానీ: అభిషేకం సీరియల్ నటి)
వరుణ్ కెరీర్‌లోనే అతి తక్కువగా కేవలం 1.9కోట్ల కనెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఏరియాల వారిగా చూస్తే..నైజాంలో రూ. 60 లక్షలు, సీడెడ్‌లో రూ.15 లక్షలు, ఆంధ్రాలో రూ.65లక్షలు, కర్ణాటక, రెస్టాఫ్ ఆఫ్ ఇండియాలో రూ.50 లక్షలు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.1.40 కోట్ల గ్రాస్, రూ. 75లక్షల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది.
(చదవండి: ‘గాండీవధారి అర్జున’ మూవీ రివ్యూ)
వరుణ్ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా మిగిలిన వరుణ్ గత సినిమా గని తొలి రోజు రూ. 3 కోట్లు రాబట్టడం గమనార్హం. ఈ లెక్కన వరుణ్ కెరీర్‌లోనే గండీవధారి అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయే అవకాశం మెండుగా ఉంది. ఇక ఈ చిత్రానికి రూ. 17 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగినటట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 18 కోట్లు రాబట్టాలి. తొలి రోజే వసూళ్లు దారణంగా ఉండడంతో బ్రేక్ ఈవెన్ అసాధ్యమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment