Varun Tej's Gandeevadhari Arjuna Movie Next Schedule Update - Sakshi
Sakshi News home page

Varun Tej: ఫారిన్‌లో ఫైట్‌ చేసేందుకు రెడీ అయిన వరుణ్‌ తేజ్‌

Published Fri, May 5 2023 8:55 AM | Last Updated on Fri, May 5 2023 11:20 AM

Gandivdhari Arjuna: Varun Tej Movie Next Schedule Update - Sakshi

ఫారిన్‌ ఫైట్‌ చేయడానికి రెడీ అవుతున్నాడు హీరో వరుణ్‌ తేజ్‌. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గాండీవధారి అర్జున’. సాక్షీ వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.  ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ బుడాపెస్ట్‌లో ఆరంభం కానుంది. ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఈ ఫైట్‌ సీక్వెన్స్‌ కోసం వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం ప్రిపేర్‌ అవుతున్నాడు. 

దీంతో పాటు వరుణ్‌ మరో సినిమా కూడా చేస్తున్నాడు. భారతీయ వైమానిక దళ పైలెట్‌గా ఓ మూవీ చేస్తున్నాడు. దేశంలో జరిగిన వైమానిక దాడుల్లో మన సైనికులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? ఎంత వీరోచితంగా పోరాడతారో కళ్లకు కట్టినట్లు చూపించనున్నాడు తేజ్‌. శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా డైరెక్ట్‌ చేస్తున్న ఈ చిత్రాన్ని సందీప్‌ ముద్దా నిర్మిస్తున్నారు.

చదవండి: సిక్స్‌ ప్యాక్‌ కోసం కసరత్తులు, హీరోయిన్‌పై ట్రోలింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement