2022.. సమ్మర్ సీజన్ పై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. అప్పటికీ థర్డ్ వేవ్ తగ్గి థియేటర్లు తెరుచుకుంటే మాత్రం ఇండియాలో ఉన్న థియేటర్లు అన్ని స్టారాతి స్టార్ల సినిమాలతో కళకళలాడటం ఖాయం. సమ్మర్‌లో విడుదలయ్యే చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఆర్‌ఆర్‌ఆర్, రాధేశ్యామ్ పోస్ట్ పోన్ అయ్యాయి. ఈ చిత్రాలు సమ్మర్ సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఐదేళ్ల క్రితం ఏప్రిల్ 28న విడుదలై సంచలన విజయం సాధించింది బాహుబలి 2. ఇప్పుడు అదే తేదిన ఆర్‌ఆర్‌ఆర్‌ని విడుదల చేసేందుకు ట్రై చేస్తున్నాడట రాజమౌళి.
సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ కూడా సమ్మర్ సీజన్ లోనే ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అలాగే మెగా మల్టీస్టారర్ ఆచార్య కూడా ఫిబ్రవరిలో రిలీజ్ కావడంలేదని,మూవీని సమ్మర్ లోనే విడుదల చేయాలనుకుంటున్నారని ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేశ్‌నటిస్తున్న సర్కారు వారి పాట కూడా ఎట్టిపరిస్థితుల్లో వేసవి కానుకగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనిల్ రావిపూడి మేకింగ్ లో తెరకెక్కుతున్న ఎఫ్ 3 కూడా సమ్మర్ సీజన్ లోనే రానుంది.
ఈ వేసవికి తెలుగు చిత్రాలు మాత్రమే కాదు. పరభాషా చిత్రాలు కూడా టాలీవుడ్ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించబోతున్నాయి. ఏప్రిల్ 14న శాండల్ వుడ్ నుంచి కేజీయఫ్ 2 తో రాఖీ భాయ్ వస్తున్నాడు. సేమ్ డే బాలీవుడ్ నుంచి ఆమిర్ ఖాన్ కొత్త సినిమా లాల్ సింగ్ చెద్దా రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో నాగ చైతన్య ముఖ్యమైన పాత్రలో నటించాడు. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా లాల్ సింగ్ చెద్దా సందడి చేయడం ఖాయం.
ఇక కోలీవుడ్ నుంచి అజిత్ నటించిన వాలిమై, మరో తమిళ స్టార్ విజయ్ నటించిన బీస్ట్, సూర్య కొత్త సినిమా కూడా వేసవి కానుకగానే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ చిత్రాలు కూడా టాలీవుడ్ లో భారీ స్థాయిలో విడుదలకు ప్రయత్నించబోతున్నాయి. మొత్తంగా రాబోయే సమ్మర్ సీజన్ సీనీ ప్రేమికులకు గొప్ప అనుభూతిని కలిగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment