
ఎఫ్ 3 చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను తెరకెక్కించడంలో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు `సరిలేరు నీకెవ్వరు`తో కలెక్షన్ల వర్షం కురిపించారు అనిల్ రావిపూడి. ఇక ఎఫ్ 2 సినిమాతో నవ్వుల వర్షం కురిపించిన అనిల్ రావిపూడి..ఎఫ్ 3తో మరోసారి నవ్వించేందుకు రాబోతోన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
(చదవండి: ఎవరు మీలో కోటీశ్వరులు: కొరటాల, జగ్గన్నలను ఓ ఆటాడుకున్న తారక్..)
ఎఫ్2 సూపర్ హిట్ కావడంతో.. దానికి సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్3పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ మూవీ ఆసాంతం నవ్వుల ఝల్లు కురిపించేలా అనిల్ రావిపూడి స్క్రిప్ట్‌ను రెడీ చేశారట. ఎఫ్ 3 చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో నేడు (శుక్రవారం) ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిత్ర తారాగణం అంతా పాల్గొననున్నారు. మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ అందరి మొహాలపై చిరునవ్వుతో సెట్ అంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.