వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 3’. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే ప్రత్యేక పాటలో సందడి చేయనున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ‘ఎఫ్ 3’ ఈ నెల 27న విడుదలకానుంది.
ఈ నెల 9న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ‘‘టీజర్‌ను విడుదల చేయడం లేదు. నేరుగా ట్రైలర్‌ను విడుదల చేస్తున్నాం. ఫన్ రైడ్ ట్రైలర్‌ను చూసేందుకు మరో వారం రోజులు ఎదురు చూస్తే చాలు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.
రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: సాయి శ్రీరామ్.
The FUN BOMB explodes BIG with a Blasting Update 💥
— Sri Venkateswara Creations (@SVC_official) May 2, 2022
Get ready to tickle your fun bones with a FUN-tastic #F3Trailer 🥳
Releasing on MAY 9th 🙌#F3Movie@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @ThisIsDSP @SVC_official @adityamusic#F3OnMay27 pic.twitter.com/2O99fJBWkw
Comments
Please login to add a commentAdd a comment