Venkatesh And Varun Tej F3 Movie New Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

F3 Movie Release Date: ఎఫ్‌3 కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

Published Mon, Feb 14 2022 11:33 AM | Last Updated on Mon, Feb 14 2022 12:41 PM

Venkatesh, Varun Tej F3 Movie Will Release On May 27 - Sakshi

‘ఎఫ్‌ 2’తో మంచి వినోదాన్ని అందించి, ఇప్పుడు అంతకు మూడింతల వినోదాన్ని ఇవ్వడానికి రెడీ అవుతోంది ‘ఎఫ్‌ 3’ టీమ్‌. ఈ చిత్రం డబ్బు చుట్టూ తిరుగుతుంది. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 28న ఎఫ్‌ 3 విడుదల చేస్తామని గతంలో చిత్రయూనిట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే! తాజాగా ఒక నెల వెనక్కు జరిగిందీ సినిమా. మే 27న సమ్మర్‌ కానుకగా రిలీజ్‌ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

'పిల్లలు పరీక్షలు ముగించుకోండి, పెద్దలు సమ్మర్‌ సందడికై తయారుకండి.. ఫన్‌ పిక్నిక్‌కు డేట్‌ ఫిక్స్‌ చేశాం.. మే 27న ఎఫ్‌3 వస్తోంది. ఇంక డేట్‌ మార్చే ప్రసక్తే లేదు' అని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతదర్శకుడు. తమన్నా, మెహరీన్‌ కథానాయికలుగా రాజేంద్ర ప్రసాద్, సునీల్‌ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో మూడో హీరోయిన్‌గా సోనాల్‌ చౌహాన్‌ కనిపించనున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్‌ 29న ఆచార్య రిలీజవుతోంది. ఎఫ్‌ 3 రిలీజ్‌ డేట్‌ను సవరించడంతో ఈ రెండు పెద్ద సినిమాల మధ్య క్లాష్‌ తప్పినట్లైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement