‘ఊ.. ఆ.. ఆహా.. ఆహా’ అంటూ తాడు పట్టుకుని వెంకటేశ్, వరుణ్ తేజ్ ఒకవైపు... తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ మరోవైపు బరిలోకి దిగారు. ఈ సందడి అంతా ‘ఎఫ్ 3’లో ఓ పాటలో కనిపించనుంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.
కాగా ఈ చిత్రంలోని ‘ఊ.. ఆ.. ఆహా.. ఆహా’ అంటూ సాగే రెండో పాటని ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించి, ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ‘‘ఊ.. ఆ.. ఆహా...’ పాట కోసం దేవిశ్రీ ప్రసాద్ ఎనర్జిటిక్ ట్యూన్ ఇచ్చారు. ఈ పాట ఆకట్టుకునే విధంగా ఉంటుంది. మే 27న మా సినిమాని విడుదల చేస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే ఓ ప్రత్యేక పాటలో కనిపిస్తారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: హర్షిత్ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment