ఎఫ్‌ 3లో సోనాలి చౌహాన్‌ రోల్‌పై స్పందించిన అనిల్‌ రావిపూడి | F3 Movie: Anil Ravipudi About Sonali Chauhan Role In Movie | Sakshi
Sakshi News home page

Anil Ravipudi-F3 Movie: సోనాలి చౌహాన్‌ పాత్ర ఏంటన్నది మాత్రం చెప్పను

Published Mon, May 16 2022 9:31 PM | Last Updated on Mon, May 16 2022 9:33 PM

F3 Movie: Anil Ravipudi About Sonali Chauhan Role In Movie - Sakshi

టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌ అనిల్‌ రావిపూడి ముందు వరుసలో ఉంటాడు. ఆయన తెరకెక్కించిన చిత్రాలు ఒకదానికి ఒకటి అంతకుమించి అన్నట్టుగా ఉంటాయి. అనిల్‌ రావిపూడి సినిమాల్లో యాక్షన్‌ సీన్స్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ సీన్స్‌ కూడా ఉంటాయి. అందుకే ఆయన రూపొందించి పటాస్‌ సినిమా నుంచి ఎఫ్‌ 2 వరకు మూవీ వరకు ఒకదానికి మించి మరోకటి హిట్‌ కొట్టాయి.  ఈ నేపథ్యంలో ఆయన తాజాగా తెరకెక్కంచి చిత్రం ఎఫ్‌ 3. ఎఫ్‌ 2కు ఇది సీక్వెల్‌. ఈ చిత్రం మే 27 థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఆయన మీడియాతో ముచ్చటించాడు.

అయితే ఇటీవల రిలీజ్‌ చేసిన ఎఫ్‌ 3 ట్రైలర్‌లో తమన్నా, మెహ్రీన్‌లతో పాటు సోనాలి చౌహాన్‌ మూడో హీరోయిన్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలో సోనాలి రోల్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఆమె క్యారెక్టర్‌ ఏంటీ? తన రోల్‌ అనిల్‌ ఎలా డిజైన్‌ చేశాడనేది ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో మెదిలే ప్రశ్న. ఈ ఇంటర్య్వూలో అనిల్‌కు సోనాల్‌ చౌహాన్‌ రోల్‌పై ప్రశ్న ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. ‘ఆమె పాత్రను గురించి మాత్రం అడగొద్దు .. అది సస్పెన్స్. సోనాల్ పాత్ర ఏమిటి? ఆమె ఏం చేస్తుందనేది తెరపై చూడాల్సిందే. ఇప్పుడే చెప్పేస్తే ఆ కిక్కుపోతుంది’ అంటూ ఆయన మరింత ఆసక్తిని పెంచేశాడు. కాగా ఈ సినిమాలో విక్టరి వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌లు హీరోలు కాగా తమన్నా, మెహ్రీన్‌ కౌర్‌ నటించారు. శ్రీ వెంకటేశ్వ‌రా క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు, శిరీష్‌లు నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్టే ఓ స్పెష‌ల్ సాంగ్‌లో కనిపించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement