F3 Movie: More Fun with Venkatesh and Varun Tej new roles - Sakshi
Sakshi News home page

F3 Movie: రేచీకటితో వెంకటేశ్‌, నత్తితో వరుణ్‌.. మామూలుగా ఉండదుగా

Published Wed, Aug 11 2021 8:33 AM | Last Updated on Wed, Aug 11 2021 12:12 PM

Venkatesh And Varun Tej Roles Makes More Fun In F3 Movie - Sakshi

రెండేళ్ల క్రితం సంక్రాంతి అల్లుళ్లుగా వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ ‘ఎఫ్‌ 2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) చిత్రంతో థియేటర్స్‌లో చేసిన హంగామాకు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. తాజాగా వెంకీ, వరుణ్‌ మళ్లీ ‘ఎఫ్‌ 3’ (ఫన్, ఫ్రస్ట్రేషన్‌ అండ్‌ వెర్‌ ఫన్‌)తో నవ్వులు పూయించేందుకు రెడీ అవుతున్నారు. ‘ఎఫ్‌ 2’ని తెరకెక్కించిన అనిల్‌ రావిపూడియే ‘ఎఫ్‌ 3’కి దర్శకుడు. ‘దిల్‌’ రాజు నిర్మిస్తున్నారు. ‘ఎఫ్‌ 2’లో లాగే వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్‌ నటిస్తుంది. కాగా ఈ చిత్రంలో రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేశ్, నత్తి ఉన్న వ్యక్తి పాత్రలో వరుణ్‌ నటిస్తున్నాడని తెలిసింది.

‘ఎఫ్‌ 2’లో ‘రెచ్చిపోదాం బ్రదర్‌’ అంటూ ఇద్దరూ సందడి చేశారు. ఇప్పుడు ‘ఎఫ్‌ 3’లో ఈ కో–బ్రదర్స్‌ మరింత రెచ్చిపోయి నటిస్తున్నారని సమాచారం. వరుణ్‌ అయితే నత్తి నత్తిగా మాట్లాడుతూ ఓ రేంజ్‌లో నటిస్తున్నాడట. దీన్ని బట్టి వెండితెరపై వెంకీ, వరుణ్‌ల ఫన్‌ ‘ఎఫ్‌ 2’ను మించి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో సునీల్, మురళీ శర్మ, అంజలి కీలక పాత్రలో నటిస్తు‍న్నారు. సెకండాఫ్‌లో మురళీ శర్మ హంగామా మామూలుగా ఉండదట. వచ్చే సంక్రాంతికి ‘ఎఫ్‌ 3’ రిలీజ్‌ కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement