Actress Pragathi Emotional Speech In F3 Movie Success Meet, Details Inside - Sakshi
Sakshi News home page

Actress Pragathi: కాఫీ, టీ మోశాను.. కన్నీళ్లు పెట్టుకున్న నటి ప్రగతి

Published Wed, Jun 1 2022 1:19 PM | Last Updated on Wed, Jun 1 2022 2:47 PM

Actress Pragathi Emotional Speech In F3 Success Meet - Sakshi

Actress Pragathi Emotional Speech In F3 Success Meet: దగ్గుబాటి విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోలుగా తమన్నా మెహరీన్‌, సోనాల్‌ చౌహన్‌ హీరోయిన్స్‌గా నటించిన ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌ మూవీ 'ఎఫ్ 3' (F3). అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించారు. మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ విజయవంతంగా దూసుకుపోతోంది. ఫ్యామిలీతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 27.55 కోట్లు కొల్లగొట్టిందని సమాచారం. సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా సోమవారం (మే 30) సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ మీట్‌లో చిత్రబృందం వారి అనుభవాలను పంచుకున్నారు. ఇందులో భాగంగానే నటి ప్రగతి వ్యక్తిగత విషయాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

'కెరీర్ ప్రారంభం నుంచి ఎన్నో మంచి పాత్రలు చేశాను. కానీ నాకు తగ్గ పాత్రలు పడలేదన్న వెలితి ఎప్పుడూ ఉండేది. ఆ ఒత్తిడి తట్టుకోలేకే కొన్నిరోజులు బ్రేక్‌ కూడా తీసుకున్నాను. కాఫీ, టీ మోయడం దగ్గర నుంచి పెద్ద విలన్‌ పక్కన నిలోచవడం, అందమైన, యంగ్‌ అమ్మ పాత్ర వరకు చాలా సినిమాల్లో సెట్‌ ప్రాపర్టీలాగే పనిచేశాను. అవేవీ సంతృప్తి ఇవ్వలేదు. కానీ ఒక మంచి పాత్ర ఎఫ్‌ 2 రూపంలో ఒక బ్లెస్సింగ్‌ వచ్చింది. తర్వాత ఎఫ్‌ 3లో అవకాశంతోపాటు నా పాత్రకు ఎంతో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా నాకెంతో సంతృప్తినిచ్చింది.' అని ఎమోషనల్‌ అయ్యారు ప్రగతి. 

చదవండి: నాకు మూడు ఫ్యామిలీలు ఉన్నాయి: అనిల్‌ రావిపూడి
అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్‌ అలీ


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement